You are currently browsing the monthly archive for జులై , 2007.

moneyplant.jpg

కొల్లూరి సోమశంకర్‌ అనువాద కథల సంకలనం ‘మనీప్లాంట్‌’ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, జండర్‌ మూలాలను స్ప­శిస్తూనే …. మనిషి అంతరాంతరాల్లో దాగున్న మనస్తత్వ నీడల్ని సైతం పొరలు పొరలుగా మన ముందు పెడుతుంది. పుస్తక పరిచయంలో గుడిపాటిగారు అన్నట్టు ‘జీవిత వైశాల్యం, విస్తృతులను’ ఇవి అనుభవంలోకి తెస్తాయి. ప్రపంచీకరణ తర్వాత తీవ్రమైన వినిమయ సంస్కృతిని, బలహీనపడ్డ అనుబంధాల్ని… మానవీయ విలువల రాహిత్యాన్ని ‘సూక్ష్మ’ రూపంలోనే అయినప్పటికీ ఈ కథలు శక్తివంతంగా అద్దంపడతాయి. అన్నింటికన్నా రచయిత ‘అనువాద రీతి’ కొత్తపాఠకుల నుంచి తలపండిన పాఠకుల వరకూ మెప్పించే రీతిలో ఉండడం విశేషం. ఎంతో సరళమైన భాషా సౌందర్యాన్ని తన అనువాద ప్రక్రియలో ఆయన అనుసరించారు.

Read the rest of this entry »

alaavaa.jpg

ఇవాళ్టి ముస్లిం కవికి తన అభివ్యక్తిని స్వేచ్ఛగా ప్రకటించే పరిస్థితి లేదు. తన జీవిత సంఘర్షణల వ్యక్తీకరణను అవతలివాళ్లు ఎలా తీసుకుంటారోననే భయసందేహాలతో ఇవాళ ముస్లిం బుద్ధిజీవులు బతకవలసిన స్థితి ఉంది. ఆ ఒత్తిడిలో వెలువడిన ముస్లిం యువకవుల సంస్కృతీ గీతాల సంకలనం ‘అలావా’.

‘ముస్లిం సంస్కృతి కవిత్వం’ అని ఈ పుస్తకానికి ఉన్న ఉపశీర్షిక చాల ఆలోచనా స్ఫోరకమైనది. ముస్లిం సంస్కృతి  అనగానే మన సమాజంలో ఎన్నో అపార్థాలు, అపోహలు, దురభిప్రాయాలు ఉన్నాయి. వాటిని సృష్టించి, పెంచి పోషించే పనిని సంఘ పరివారం ఉద్దేశపూర్వకంగానే సాగిస్తోంది. ఆ తప్పుడు ప్రచారానికి మొత్తం సమాజమే తెలిసీ తెలియకుండా బలి అయిపోతోంది. అటువంటి సందర్భంలో ముస్లిం సంస్కృతి  అంటే ఏ విలువలకు నిలబడేదో, దాని అంతస్సారం ఏమిటో నిర్దిష్టంగా , కచ్చితంగా ప్రకటించవలసి ఉంది. ఆ అవసరాన్ని తీరుస్తూ , ఇవాళ్టి తెలుగు సమాజంలో ముస్లిం సంస్కృతి  కవిత్వం అంటే ఏమిటో కవితాత్మకంగా ప్రకటిస్తూ వెలువడింది ‘అలావా’. షాజహానా, స్కైబాబా సంపాదకులుగా డెబ్బై ఒక్కమంది ముస్లిం కవులు రాసిన 102 కవితల సంకలనం ఇది.

Read the rest of this entry »