You are currently browsing the monthly archive for నవంబరు, 2007.
ఇంటీరియర్ డెకరేషన్‌కు అనువుగా బాపు వేసిన రంగురంగుల చిత్రాలను ఒక అందమైన కాటలాగ్‌లా తయారుచేసి, వాటికి నెంబర్లు ఇచ్చి కావలసిన వారికి వాటిని ఎన్‌లార్జిచేసి ఇచ్చేందుకు వీలుగా ‘హరివిల్లు’ పేరుతో ఒక చక్కటి పుస్తకాన్ని ప్రచురించారు విజయవాడ రైన్‌బో ఆర్ట్ సీరీస్‌వారు. ఈ పుస్తకం గురించి రాయబోయే ముందు బాపు చిత్రకళ గురించి కొంత సింహావలోకనం చేయవలసి ఉంది.

గోదారి ముంచటం చూసినం/ గోదాట్లో ముంచడం కొత్త కథ’ తెలంగాణను అభివృద్ధికి దూరం చేస్తున్న పరిణామాలపై హనీఫ్ ఆవేదన ఇది (అడవీ, అంబులపొది). ఇది కాకుండా శవాల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి తెలంగాణలో విషాదం. అన్నలో, అయ్యలో, లేకపోతే దుబాయిలో మరణించిన వారో – ఒక సంక్షోభం నుంచి విముక్తం కావాలనుకున్నవారంతా శవాలై గ్రామాలకు చేరడం గురించి వి.ఆర్.శర్మ (ఇంకారాని శవాలు) రాసిన కవిత ఈ 55 కలాల సంకలనంలో చాలాకాలం గుర్తుంటుంది. చక్కని ముఖచిత్రం, కవితలకు వేయించిన ముచ్చటయిన చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.
తెలంగాణ కవిత (2006),
సం. సుంకరి రమేశ్, అన్వర్, ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలలో
పేజీలు 116
వెల రూ 50
(4-11-2007 ఆదివారం ఆంధ్రజ్యోతి నుండి)


ఇటీవలి అభిప్రాయములు