తెలుగు పుస్తకం

పాఠకులున్నారు జాగ్రత్త!
ఆంధ్రజ్యోతి నుండి…

పుస్తకప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లాగా కళ్ల కూ, హృదయానికీ అద్దుకుని మరీ కొనుక్కున్నారు. బహుశా తాము కారు కొన్న రాత్రి కంటే పుస్తకాలు కొన్న రాత్రి సుఖంగా నిద్రపోయి ఉంటారు.. మనిషికి మృత్యువు ఉంది కాని పుస్తకానికి చావులేదని, పుస్తకానికి చావురాదని, పుస్తకం చావదని మర్త్య మానవులు పుస్తకాన్ని దీవించిన సందర్భం ఇదేనని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ముమ్మారు నినదించింది.

పుస్తకం పట్టిన చేతులకు కృతజ్ఞతలు

పుస్తకాన్ని పట్టి ఇచ్చిన, పుస్తకాల పట్టీ ఇచ్చిన చేతులకు ధన్యవాదాలు

బుక్కులకు బుక్కైపోయిన మహనీయులు వర్ధిల్లాలి

పుస్తకాలకు లొంగిపోయిన మానవీయులకు జిందాబాద్‌

అనేక, అసంఖ్యాక గ్రంథాలముందు విధేయులై, వినమ్రులూ ఐ

నిలబడిన ఆ బాలగోపాలానికి హేట్సాఫ్‌

‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అనే పాటను కొద్దిగా మార్చి పాడుకోవాలనిపిస్తోంది.. “పిల్లలూ, దేవుడూ, పుస్తకప్రియులూ చల్లనివారే కల్లకపట మెరుగనీ కరుణామయులే” అని ఆలాపించాలనిపిస్తోంది.. 23వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నెక్లెస్‌ రోడ్‌కి అతి విలువైన గ్రంథ హారాన్ని ఓ పదిరోజులపాటు అద్దెకిచ్చింది. పది రోజులూ నెక్లెస్‌ రోడ్‌ మెడలో వేళ్లాడే పుస్తక హారం బరువుకి తల ఎటూ తిప్పలేక పుస్తకంలోకే తొంగిచూసింది.

ఇది నిజంగా పుస్తక తులాభారం. పుస్తకాలు సత్యభామ, రుక్మిణులై, రుక్మిణులై, పదారు వేలమంది గోపికలై వివిధ రూపాల పాఠక శ్రీకృష్ణ హృదయాన్ని అధివసించడానికి ప్రయత్నం చేసాయని అనటానికి నోరు రావటం లేదు. మనిషి పరమాత్ముడు, పుస్తకం ఆత్మ అయితే- ఈ ఆత్మలు పరమాత్మలో తనం కావడానికి, పరమాత్మను చేరుకోవడానికి తహతహలాడాయి అని అనాలి. తమ పరమాత్మను తామే వెతుక్కుని పుస్తకాత్మలు సేదదీరాయి. తమ వియోగానికిక తెర పడిందని, తమ ప్రియులకు తృప్తిని, తమకు మోక్షాన్ని సిద్ధింపజేస్తామని ప్రకటిస్తూ వెళ్లిపోయాయి.

పుస్తకప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లాగా కళ్లకూ, హృదయానికీ అద్దుకుని మరీ కొనుక్కున్నారు. బహుశా తాము కారు కొన్న రాత్రి కంటే పుస్తకాలు కొన్న రాత్రి సుఖంగా నిద్రపోయి ఉంటారు. ఎన్నో పుస్తకాలను పాఠక దేవుళ్లు కొన్నారని ఈ పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. ప్రజలు కార్లు మాత్రమే కాదు, పుస్తకాలు కూడా కొంటారని ఈ బుక్‌ ఫెయిర్‌ ఖరాఖండిగా చెప్పింది. మనిషికి మృత్యువు ఉంది కాని పుస్తకానికి చావులేదని, పుస్తకానికి చావు రాదని, పుస్తకం చావదని మర్త్య మానవులు పుస్తకాన్ని దీవించిన సందర్భం ఇదేనని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ముమ్మారు నినదించింది. పిల్లలు రంగురంగుల బొమ్మల పుస్తకాల వైపు, కథల వైపు, సి.డి.లవైపు లేత పూలలాగా ప్రవహించారు.

యువకులు వ్యక్తిత్వ నిర్మాణాలవైపు, ఉపాధి అవకాశాలను తెలిపే సమాచారమిచ్చే పుస్తకాలవైపు నడిచారు. మహిళలు వంటల పుస్తకంతో మొదలుపెట్టి లలితా సహస్రనామాల దగ్గర ఆగారు. అక్కడక్కడా గురువుల దగ్గర, గురు చరిత్రల దగ్గర నిలిచిపోయారు. పరిశోధకులు తమ తమ పరిశోధన అంశాలకు సంబంధించిన విషయ సేకరణ చేసుకున్నారు. పెద్దలు ఆధ్యాత్మిక, భక్తి గ్రంథాలను దేవులాడుకున్నారు. వృద్ధులు జీవితానుభవసారాన్ని వ్యాఖ్యానించే పుస్తకాలవైపు మొగ్గుచూపారు. విశ్రాంత ఉద్యోగులు పెన్షన్‌ డబ్బుల్ని తడిమి చూసుకుని, చూపు ఆనిన మేరకు ఒకటీ అరా పుస్తకాలను కొనుగోలు చేశారు. అధ్యాపకవర్గం ధరల విషయంలో చిరాకుపడింది. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు హుందాగా గ్రంథాలు కొన్నారు. అసిస్టెంట్‌- అసోసియేట్‌ ప్రొఫెసర్లు డిస్కౌంట్‌ ఎక్కువ ఇవ్వమని అడిగిచూశారు. కొనదలచిన పుస్తకాల్లో ఒకటీ అరా తగ్గించుకున్నారు.

ఐ.టి.ప్రొఫెషనల్స్‌ ఈసారి కొద్దిగా సంస్కృతి, సామాజిక పరిణామం, జీవిత చరిత్రలవైపు తొంగి చూసినట్లున్నారు. సాహిత్యాభిమానం గల పాత్రికేయులు ఆయా కవుల, రచయితల పుస్తకాలు కొనుగోలు చేశారు. అనువాదం, అనువాద సిద్ధాంతాలపై గ్రంథాలు స్వల్పంగా అమ్ముడయ్యాయి. భాష, సంస్కృతి, గిరిజనులపై మోనోగ్రాఫ్‌ల్లాంటివి కూడా కొన్ని అమ్ముడయ్యాయి. అరవింద అడిగ వైట్‌ టైగర్‌ పుస్తకం గురించి వాకబు ఎక్కువ జరిగింది. ఒబామా ప్రత్యేక ఆకర్షణ. హ్యారీ పోటర్‌ పిల్లల సంబరం. రజనీష్‌పై ఆసక్తి అదేవిధంగా కొనసాగుతోంది.

జిడ్డు కృష్ణమూర్తిపై కుతూహలం, సంశయం, పాఠకుల్లో.. ఇస్కాన్‌ ఎక్కడ? కొత్త పాఠకులు ఏర్పడుతూ ఉన్నారనడానికి సూచన. నాట్యం, చిత్రకళ, శిల్పం, సంగీతం పరిమిత సంఖ్యలో అమ్మకాలు. ఎడ్యుకేషన్‌పై గ్రంధాలు, సామాజిక శాస్త్ర గ్రంధాలు హాట్‌ కేకులు కాకపోయినా ఒక మాదిరిగా కదిలాయి. పెద్దబాలశిక్ష సూపర్‌ డూపర్‌ హిట్‌. వ్యసన సంస్కృతిని వదిలిపెట్టి అభ్యసన సంస్కృతివైపు వెళ్తున్నాం అనడానికిది నమ్మదగిన సూచన కాకపోవచ్చు. నేర్చుకోవటంలోని వెలితికి, నేర్చుకున్నది మరచిపోతున్న తక్షణ సంస్కృతికి కూడా గురుతు కావచ్చు. ఆర్‌.కె గారన్నట్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ తన కాస్మాపాలిటన్‌ కల్చర్‌ని విశిష్టంగానే పట్టిచూపింది. మంచి పుస్తకాన్ని ఎంచి మరీ కొంటున్నారు. పాఠకులున్నారు

జాగ్రత్త. పబ్లిషర్స్‌ ఎంచి మరీ మంచి పుస్తకాలే వేయాలేమో! పదిరోజుల పుస్తక ప్రదర్శన పది కాలాలపాటు పాఠకులకు ఎటువంటి పుస్తకాలు, ఏ యే ధరల్లో వేయాలో విడమరచి చెప్పింది. ద్రావిడ విశ్వవిద్యాలయానికి స్టాల్‌ నెం 13కు చేకూరిన లాభమిదే. ఈ ఎగ్జిబిషన్‌లు ఆంధ్రదేశంలోని కవులు, రచయితలు చాలామంది కలిశారు. మా ద్రావిడ విశ్వవిద్యాలయం స్టాల్‌ను దర్శించారు. కొన్ని పుస్తకాలు కూడా కొన్నారు. నేను మాత్రం వచ్చే సందర్శకులలో స్మైల్‌ను, జ్వాలాముఖిని వెతుక్కుంటున్నాను. ఈ ఇద్దరే కనిపించడం లేదు…!

- సీతారాం

‘అట్ట’హాసం కాదు.. అక్షరాలకు అద్దం
ఆంధ్రజ్యోతి నుండి…

ఇవాళ తెలుగు సాహిత్యంలో అసంఖ్యాకంగా వస్తున్న పుస్తకాల ముఖపత్రాలు అన్ని రకా లుగా బాగుంటున్నాయా?! ఆ ముఖపత్ర భాష ఎందరిని ఆకర్షించగలుగుతోంది? కొన్ని మంచి పుస్తకాలు సైతం పేలవమైన కవర్‌ పేజీతో చాలామంది దృష్టికి వెళ్లకుండానే మిగిలిపోవడం లేదూ..

కొన్ని పుస్తకాల్ని చూడగానే చేతిలోకి తీసుకోవాలనిపిస్తుంది. ముఖపత్రం పైన కాసేపు దృష్టి నిలిచిపోతుంది. పుస్తకంలోని ఆత్మ ముఖపత్రం ద్వారా మనలోకి ప్రసరిస్తుంది.. ఇవాళ తెలుగు సాహిత్యంలో అసంఖ్యాకంగా వస్తున్న పుస్తకాల ముఖపత్రాలు అలా ఉంటున్నాయా?! ఆ ముఖపత్ర భాష ఎందరు చదువగలుగుతున్నారు? అన్ని రకాలుగా అందంగా అమిరే ముఖపత్రాలు (కవర్‌లు) ఎన్ని? ఈ దృష్టితో పరిశీలిస్తే అత్యధికశాతం కవర్‌లు ఏదో ఒక లోపంతో కనిపిస్తుంటాయి.

కొన్ని మంచి పుస్తకాలు సైతం పేలవమైన డిజైన్‌తో పాలిపోయినట్లు కనిపిస్తాయి. పుస్తకంలోని కంటెంట్‌ బాగున్నా కవర్‌ పేజీ బాగుండక చాలామంది దృష్టికి వెళ్లని పుస్తకాలెన్నో.. ముఖ్యంగా బొమ్మ, పుస్తకం పేరు, రచయిత పేర్లతోపాటు బ్యాక్‌ కవర్‌ మ్యాటర్‌, మంచి పేపర్‌, చక్కటి రంగులు.. వీటన్నింటితో కూడిన కవర్‌ పేజీ పాఠకుడి దృష్టిని ఆకర్షించే అవకాశం వుంది. ఈ విషయమై డిజైనింగ్‌ కూడా చేస్తున్న కొందరు ఆర్టిస్టులను కదిపితే- మనదేశంలో అన్ని భాషల ముఖపత్రాల ‘డిజైన్‌’ కన్నా తెలుగు పుస్తకాల కవర్‌పేజీల డిజైనింగ్‌ చాలా బాగుంటోందని అంటున్నారు.

గతంలో ఆర్టిస్టే కవర్‌పేజి డిజైనర్‌. ఉదాహరణకు బాపు, శీలా వీర్రాజు, చంద్ర, బాలి, గోపి, ఉత్తమ్‌, మోహన్‌ టి.వి.ప్రసాద్‌, లక్ష్మణ్‌ ఏలే, రమణ జీవి, అక్బర్‌ వంటి చిత్రకారులు. క్రమంగా డిజైనర్‌ అనే ఒక పని కూడా ఎవాల్వ్‌ అయింది. ఇది బహుశా అడ్వర్జయిజింగ్‌ ఏజెన్సీస్‌ లేక విదేశాల ప్రేరణ కావొచ్చు. దానికి కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా తోడయి ఒక వృత్తి స్థాయిలో స్థిరపడింది. ఇందులో కేవలం ఒక ఆర్టిస్ట్‌ వేసిన బొమ్మలతోనే కాకుండా అనేక పద్ధతులతో కవర్‌పేజీలు చేసే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అసలు ఆ ఆర్టిస్ట్‌ వేసిన బొమ్మని ఆ ఆర్టిస్టే నమ్మలేనంత అద్భుతంగా ఎక్స్‌ప్లాయిట్‌ చేయగలిగే కంప్యూటర్‌ పరిజ్ఞానం డెవలప్‌ అయింది. కాబట్టి ప్రస్తుతం వస్తున్న కవర్‌పేజీలు ఎం తో విలక్షణంగా, ఎంతో విభిన్నంగా వుంటున్నాయి.

బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి కట్‌ కలర్‌ దాటి, మల్టీ కలర్‌ (4) ఇంకా ముందుకెళ్లి స్పెషల్‌ కలర్స్‌ (5,6,7) టెక్చర్‌ కలర్స్‌ దాకా.. మాప్‌లితో పేపర్‌ నుంచి 300 జిఎస్‌ఎమ్‌ ఫారిన్‌ మ్యాట్‌కార్డ్‌ దాకా.. లామినేషన్‌, మ్యాట్‌ లామినేషన్‌, స్పాట్‌ లామినేషన్‌ (యు.వి.) టెక్చర్‌ స్పాట్‌ లామినేషన్‌.. సైడ్‌ పిన్నింగ్‌ నుండి స్పైరల్‌ దాటి పర్‌ఫెక్ట్‌ బైండింగ్‌ క్రీజింగ్‌ దాకా.. ఇంక బొమ్మల విషయానికొస్తే.. ఇంక్‌ డ్రాయింగ్‌ నుండి వాటర్‌ కలర్‌, పోస్టర్‌ కలర్‌, చార్‌కోల్‌, పేస్టల్‌, పెన్సిల్‌ దాటి ఆక్రిలిక్‌ కలర్స్‌, ఆయిల్‌ కలర్స్‌ పెయింటింగ్స్‌ అట్ట మీద బొమ్మలుగా వస్తున్నాయి. ఇంకాస్త ముందుకెళ్లి డిజిటల్‌ డ్రాయింగ్స్‌ వస్తున్నాయి.. తొలిరోజుల్లో పుస్తకం పేరూ, రచయిత పేరు మాత్రమే కవర్‌ టైటిల్‌గా వుంటూ వచ్చింది. ఆర్టిస్టు వేసిన బొమ్మను అతను సూచించిన రీతినే బాక్సులోనో ఓపెన్‌గానో అట్టమీద పెట్టేసి అచ్చేసేవారు. తర్వాత్తర్వాత ఒకటీ రెండు రంగులు, లేదా మూడు రంగుల్లో కట్‌ కలర్స్‌ పద్ధతిలో బ్లాకులు చేసి అచ్చువేసేవారు. ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ రావడంతో మల్టీకలర్‌ ముఖచిత్రాలు విరివిగా వాడకంలోకి వచ్చాయి.

ఇవాళ సాహితీవేత్తలంతా మల్టీకలర్‌లో టైటిల్‌ వేసుకోడానికి యిష్టపడుతున్నారు. ఆర్టిస్టుతో బొమ్మ వేయించుకొని తమకిష్టమైన రీతిలో డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఇక్కడ కొందరు కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ చేసే డిజైన్‌తోనే సరిపుచ్చుకుంటే మరికొందరు ప్రత్యేకంగా డిజైనర్లని ఆశ్రయిస్తున్నారు. బొమ్మ గీయడంతోపాటు డిజైన్‌ కూడా చేసిచ్చేవాళ్లు తక్కువ. ముఖ్యంగా డిజైనర్‌ స్వేచ్ఛకు వదిలిపెట్టకుండా రచయితలు పక్కన కూర్చుని విసిగించి తమ తెలియనితనాన్ని బైటేసుకుని పుస్తకాన్ని పాడు చేసే సందర్భాలు ఎక్కువ. ముందు డిజైనర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి చూస్తే బాగుంటుందని ఆర్టిస్టులు అంటున్నారు. అయితే ఇక్కడ బొమ్మ గీసే ఆర్టిస్టుల్లోనూ వారి భావజాలాలు, వారు ఎరిగిన జీవితాలు వారి ‘లైన్‌’ని, ఆర్ట్‌ని ప్రభావితం చేస్తాయనేది అందరి గ్రహింపుకు వచ్చిన విషయమే.

కొందరి గీత ఒక వర్గపు జీవన రేఖను దాటి రాలేదని, మరొకరి గీత అట్టడుగు వర్గాల జీవితాల్ని మాత్రమే పట్టి ఇస్తుందనే విమర్శలున్నాయి. విభిన్న అస్తిత్వ వాదాల నేపథ్యంలో కొందరి బొమ్మలు అవుట్‌డేటెడ్‌గా కనిపించవచ్చు, మరికొందరివి కొన్ని వర్గాలకే పరిమితమైనట్లు అనిపించవచ్చు.. అర్థం చేసుకోవాల్సిందల్లా రచయిత తన భావాలకు తగ్గ ఆర్టిస్టును డిజైనర్‌ను ఎంచుకున్నాడా లేదా అన్నదే. మొత్తంగా ముఖపత్రం పుస్తకం మీద తప్పక ప్రభావం చూపుతుందనేదే ఆర్టిస్టుల అభిప్రాయం. తెలుగు పుస్తకాల కవర్‌పేజీల డిజైనింగ్‌ సైంటిఫిక్‌గా మరింత మెరుగుపడాల్సిన అవసరం వుందని వారు చెబుతున్నారు.. చివరగా, సాహితీ విమర్శకులు కవర్‌ పేజీ మీద కూడా స్పందిస్తుంటే బావుంటుందని అనిపిస్తున్నది..

- స్కైబాబ

అర్ధవంతంగానూ ఉండాలి

మార్కెట్లో విడుదల చేసే ఏ వస్తువునైనా ఆకర్షణీయంగా చూపే వ్యాపార సంస్కృతి ఛాయలు యిప్పుడు గ్రంథ ప్రచురణలోకీ చొరబడ్డాయి. పుస్తకం టైటిల్‌ అందంగా వుంటూనే అర్ధవంతంగా కూడా వుండాలి. ఇటీవల కొందరు సాహితీవేత్తలు- ముఖ్యంగా కవులు పోస్ట్‌ మోడ్రన్‌ ట్రెండ్‌లను విమర్శిస్తూనే తమ పుస్తకాల కవర్‌ పేజీల మీది చిత్రకళలో మాత్రం అదే ట్రెండ్‌ అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌ని అచ్చువేసుకుంటున్నారు. దీనిలో అందమూ ఆకర్షణలకన్నా ఇతరులకంటే భిన్నంగా వుండాలనే ధోరణి కనిపిస్తుంది.

‘విషయంతో సంబంధం వుంటే మంచిదే, లేకపోయినా పరవాలేదు, ముఖచిత్రం మాత్రం అద్భుతంగా అనిపించాలి’ అనే ధోరణి చాలామంది సాహితీవేత్తల్లో కనిపిస్తోంది. ముఖచిత్రంలో బేసిక్‌ కలర్స్‌- పసుపు, మెజంటా, నీలం, నలుపు- రంగులను నేరుగా వాడడంకన్నా మిక్స్‌డ్‌ కలర్స్‌లో అయితే గాడీగా వుండకుండా కళ్లకి ఆహ్లాదకరంగా వుం టుంది. ముదురు ఎరుపు పక్కన ముదురు నీలంగాని, ముదురు ఆకుపచ్చ రంగుగాని వాడితే కళ్లకి యిబ్బందిగా వుంటుంది. ముదురు రంగుల పక్కన లేత రంగులుంటే ఆ చిత్రం బాగా ఎలివేట్‌ అవుతుంది. లామినేషన్‌ చేయిస్తే బొమ్మ అందం మరికొంత పెరుగుతుంది. పుస్తకం పేరుగాని, రచయిత పేరుగాని బొమ్మని మింగేసేటట్టు పెద్దవిగా వుండకుండా చూసుకోవాలి.

అప్పుడు టైటిల్‌ అందంగా కనిపిస్తుంది. సింగిల్‌ కలర్‌లో వేసినా కొన్ని టైటిల్స్‌ అద్భుతంగా అనిపించినవి వున్నాయి. ఇది ఆర్టిస్టు వేసిన చిత్రంపై ఆధారపడి వుంటుంది. ఒకే రంగులో స్క్రీన్‌లు రకరకాలవి యిస్తూ ఎంతో ఎఫెక్టివ్‌గా బొమ్మని ఆఫ్‌సెట్‌ ప్రింటింగులో చూపించే సౌకర్యం వుంది. నా మట్టుకు నేను స్వేచ్ఛగానే డిజైన్‌ చెయ్యగలుగుతున్నాను. పూర్తి బాధ్యత ఆర్టిస్టు మీదే వేసినప్పుడు మరింత జాగ్రత్తగా చేయాల్సివస్తుంది. బాపు, మోహన్‌ లాంటి ఆర్టిస్టులు వేసే టైటిల్‌ కవర్స్‌ పుస్తకం తెరవాలనిపించేటట్టు చేస్తాయి. చాలామంది రచయితలు కవులు ఫలానావారే తమ పుస్తకాలకు ముఖచిత్రాలు వేయాలని కోరుకోవడం, వాటికోసం నెలల తరబడి ఎదురుచూడ్డం అందుకే.

- శీలా వీర్రాజు

ఆత్మ ప్రతిఫలించాలి

ఇవాళ పెయింటింగ్‌లను తీసుకొని కవర్‌ డిజైన్‌ చేయడం జరుగుతున్నది. కవిత్వంలో ఉండే మార్మికత (అబ్‌స్ట్రాక్ట్‌నెస్‌) డిజైనింగ్‌లోకి కూడా వచ్చింది. సమకాలీన  చిత్రకళను ఉపయోగించుకోవడం గమనించొచ్చు. కంప్యూటర్‌ విరివిగా ఉపయోగంలోకి వచ్చాక గ్రాఫిక్స్‌, ఫోటోషాప్‌ ఉపయోగం పెరిగింది. దాంతో డిజైనింగ్‌ పూర్తిగా మారిపోయింది. ఇవాళ గ్రాఫిక్‌ డిజైనింగ్‌నే చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

నా దృష్టిలో అందం అనేదానికి నిర్వచనం వేరు. నేను డిస్టార్షన్‌ బొమ్మల్ని ఎక్కువ ఇష్టపడతాను. కంటెంట్‌ను బట్టి దానికి సమాంతరంగా ఊహించి బొమ్మ వేస్తాను. ఆర్టిస్టుగా నా వ్యాఖ్యానం నేను చేస్తాను. రచనలోని భావమే కాకుండా అది చదివిన ఆర్టిస్టుగా తన ఇంటర్‌ప్రెటేషన్‌ ప్రత్యేకంగా ఉండాలనేది నా అభిప్రాయం.

నాకు సంతృప్తి కలిగినట్లుగానే చేస్తాను. వేరేవారి ఐడియాను తీసుకోను. నా సొంత ఐడియాను ఎవరైతే తీసుకుంటారో వారికే నేను డిజైన్‌ చేసిపెడుతుంటాను. రచయితతో మాట్లాడి, చదివి బొమ్మ వేస్తాను. రచన యొక్క ఆత్మ బొమ్మలో ప్రతిఫలించేలా ప్రయత్నిస్తాను. క్లిప్‌ ఆర్ట్‌ను తీసుకోను. గ్రాఫిక్‌ను గ్రాఫిక్‌ డామినేట్‌ చేయకుండా చూసుకుంటాను. ఒరిజినల్‌గా నేను డ్రా చేసినవే వాడుతాను. ఒక్కోసారి నా పెద్ద పెద్ద పెయింటింగ్స్‌నే ఆ పుస్తకానికి నప్పుతుందనుకున్నదాన్ని వాడతాను.

పాఠకుల్ని ఆకర్షించడం అనేది ఆర్టిస్టు చేసే డిజైన్‌ను బట్టి ఉంటుంది. మల్టీకలర్‌ అంటే అన్ని రంగులూ తప్పనిసరి వాడాలని అనుకుంటుంటారు. నేను కేవలం రెండు రంగులనే వాడి కూడా పెయింటింగ్‌ వేస్తాను. బ్లాక్‌ అండ్‌ బ్రౌన్‌, బ్లాక్‌ అండ్‌ రెడ్‌.. అలా! చాలామంది బ్లాక్‌ను కలర్‌ అనుకోరు. వైట్‌ను కూడా కలర్‌ అనుకోరు. సింగిల్‌ కలర్‌ను వాడి కూడా అద్భుతంగా మెప్పించవచ్చు. నా పెయింటింగ్స్‌ చాలా వరకు రెండు లేదా మూడు రంగులు మాత్రమే వాడినవి. వే ఆఫ్‌ ప్రెజెంటేషన్‌ అనేది చాలా ముఖ్యం. పోస్టర్‌ చూసి సినిమా చూసే సందర్భాలు చాలా ఉంటాయి. అట్లే పుస్తకం కవర్‌ చూసి చదివించే అవకాశమూ ఉంది.

- ఏలె లక్ష్మణ్‌

చతుర్భుజమే అల్టిమేట్‌ కాదు

కవర్‌ అందంగా కనిపించాలంటే నేను చిత్రానికి ఎక్కువ స్పేస్‌ కేటాయిస్తాను. అక్షరాలను వీలయినంత సింపుల్‌గా ప్రయోగిస్తాను. ప్రధానచిత్రంలోంచే డామినెంట్‌ కలర్‌ను పిక్‌ చేసి దాన్నే అధికంగా వాడి ఎక్కువ కాంట్రాస్ట్‌ లేకుండా చేసుకుంటాను. డిజైన్‌ చేసేటప్పుడు రచయిత/కవి దగ్గర లేకుండా చూసుకుంటాను. కవర్‌ డిజైనింగ్‌ ఒక ఆర్టిస్టంత విస్తీర్ణమయిన ఆవరణ కాకపోయినా సంతృప్తికి సంబంధించిన మూలాలొకటే అనిపిస్తుంది రెండిటికీ. నాకయితే రంగులతో ఆడుకుంటున్నట్టుంది హాయిగా. నేను చాలా ఎంజాయ్‌ చేస్తాను. చేస్తున్న ప్రతి క్షణం సంతృప్తి చెందుతాను.

ఏ ఒకరో ఇద్దరో తప్ప నన్ను ఇలాగే చెయ్యమని, ఇలాగే కావాలని బలవంతం చేసినవాళ్లు లేరు. చాలామంది ఇది మీ పని మీకు నచ్చితే మాకు నచ్చినట్లే అన్నవాళ్లే. బ్లాక్‌ అండ్‌ వైట్‌ లేక సింగిల్‌ కలర్‌ కవర్లు పాఠకుల్ని తప్పకుండా ఆకర్షిస్తాయి. అందులో వుపయోగించే విజువల్‌ విలువని బట్టి. డిజైన్‌ చేసే పద్ధతిని బట్టి. నిజానికి పేరుకి మల్టీకలర్‌ ప్రింటింగ్‌ అయినా మోనోకలర్‌ వాల్యూస్‌తో చేసిన కవర్‌ పేజీలే చాలా హుందాగా వుంటాయి. ఒక వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయి, రంగులు రంగుల కవర్‌ పేజీల స్లిట్‌ పర్సనాలిటీలకంటే. సింగిల్‌ కలర్‌లో అంత డెప్త్‌ రాదు.

మల్టీ కలర్‌లో వచ్చే సింగిల్‌ కలర్‌ వాల్యూస్‌ బావుంటాయి. ముఖ్యంగా ఇవాళ కవర్‌ డిజైన్‌ ఎటు తిరిగీ చతుర్భుజంలోకి ఒదిగిపోవడమో, విస్తరించడమో జరిగింది. దాన్ని అధిగమించి డిఫరెంట్‌గా డిజైన్‌ చేయాల్సిన అవసరముంది. పాత పద్ధతుల్ని ప్రయత్న పూర్వకంగా వదులుకోవాల్సిందే. అందు కు కొత్తదనాన్ని స్వీకరించే మెత్తదనపు (్ఛ్ఠఞౌన్ఛ్చీఛజీజూజ్టీడ) ఆవశ్యకత చాలా అవసరం. కవర్‌ పేజి ప్రభావం కొత్త పుస్తకాల మీద తప్పకుండా వుంటుంది. కవర్‌పేజి అందంతోపాటు వెనక పేజీ మీద రాసివుండే ఆ పుస్తక సారాంశమో, లేక ఎవరివైనా ప్రముఖుల అభిప్రాయా లో కూడా పుస్తకం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఈ ప్రభావమంతా పుస్తకాన్ని తెరిపించేంత వరకే. తెరిచాక అందులో పుస్తకం ఆత్మ తప్పనిసరి. లేకపోతే అంతా వృధానే.

- రమణ జీవి

కవర్‌ డిజెనింగ్‌ ఒక సైన్స్‌

డిజైనింగ్‌ ఒక సైన్స్‌. ఆ అనుభవంతో కవర్‌ డిజైన్‌ చేయడం కళ. ముఖపత్రం అనేది పుస్తకం కంటెంట్‌ స్వభావాన్ని రిఫ్లెక్ట్‌ చేయాలి. విజువల్‌ ఈస్తటిక్‌ లాంగ్వేజ్‌ మీద అవగాహన, కొద్దో గొప్పో కంపోజిషన్‌ కుదురైన టైపోగ్రఫీ (అక్షరాలు రాయడం) మీద పరిజ్ఞానం వుంటే మంచి కవర్‌ పేజీ తయారవుతుంది. వీటితోపాటు సాహిత్యం మీద అభిరుచి కలిగివుండి, మనసుతో చేయగలిగివుంటే మంచి కవర్‌ డిజైన్లే వస్తాయి. నిజానికి నేను మొదట్లో.. కవర్‌ డిజైన్లు చేసేటప్పుడు పుస్తకం చదివి బొమ్మ వేసి డిజైనర్‌ దగ్గర కూర్చొని డిజైన్‌ చేయించేవాణ్ణి. కానీ నేననుకున్న ఫీల్‌ అంతగా కుదిరినట్లనిపించేది కాదు.

అందుకే నేనే గ్రాఫిక్‌ డిజైనింగ్‌ నేర్చుకుని బొమ్మ వేసుకుని డిజైన్‌ చేయడం వల్ల సరిగ్గా కావాలనుకున్న ఎఫెక్ట్‌తో చేయగలుగుతున్నాను. ఆధునిక పరిజ్ఞానం (కంప్యూటర్‌) అందించిన సౌలభ్యాన్ని కూడా అవసరం మేరకు వాడుకునే అవకాశం నాకు దీనివల్ల లభించింది. అది ఆర్టిస్టులకు అవసరం అనే భావిస్తాను. దీనివల్ల విజువలైజేషన్‌ విస్త ృతి పెరుగుతుంది. కంటెంట్‌ చేసిన డిమాండ్‌ మేరకు దీనిని వాడడం వల్ల కవర్‌ పేజీకి పూర్తి న్యాయం చేసిన వాళ్లం అవుతాం. కవర్‌ డిజైనింగ్‌లో లెజెండ్స్‌ అయిన ఆల్విన్‌ లస్టిగ్‌, పాల్‌రాండ్‌తోపాటు సమకాలీన ఇలస్ట్రేటర్‌ జాఫ్‌ గ్రాండ్‌ఫీల్డ్‌ అంటే నాకిష్టం.

పీటర్‌మెండల్‌సన్‌ డిజైన్స్‌ బాగుంటాయి. నేనెప్పుడూ కవి/రచయిత తనెక్కడ ముగించాడో అక్కడి నుంచి ఎక్స్‌టెండ్‌ అయ్యేలా బొమ్మ గీస్తాను. తను చెప్పదల్చుకున్నది ఏది వదిలేసాడో దాన్ని బొమ్మ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఇలస్ట్రేటర్‌ని. పెయింటర్‌ను. ఒక పెయింటింగ్‌ చేసినప్పటి అనుభూతి ఒక కవిత్వ పుస్తకానికో, కథల పుస్తకానికో బొమ్మ వేసినప్పుడు కలిగే అనుభూతి ఒకే విధంగా వుంటుంది. పుస్తకానికి పెట్టిన పేరు, కంటెంట్‌ను బట్టి నేను మీడియంను ఎన్నుకుంటాను. వాటర్‌ కలరా ? ఆక్రిలిక్‌ కలరా ? ఫిగరేటివ్‌ ఆబ్‌స్ట్రాక్ట్‌ వేయాలా ? చార్‌కోల్‌ డ్రాయింగ్‌ వేయాలా ? నిర్ణయించుకుంటాను

నేను చిత్రకారుడిగా ఎదిగే దశలోనే దళితవాద, స్త్రీవాద, ముస్లింవాద, తెలంగాణా, విప్లవోద్యమాలతో నడవడం వల్లే నా కవర్‌ బొమ్మలు గ్రామీణ జీవన మూలాల్నుంచి మాట్లాడతాయి. నేను ఒక సెట్‌ ఆఫ్‌ కలర్స్‌నే బొమ్మలో వాడతాను. కంటెంట్‌ డిమాండ్‌ను బట్టి కవర్‌ డిజైన్‌లో రంగులు వాడతాను. మోనో టోన్స్‌తో.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ తో చేసిన కవర్‌ పేజీలు బాగుంటాయి. డబుల్‌ కలర్స్‌ను కొందరు ఇష్టపడతారు. కవర్‌ మీదున్న రంగులు ఏ ఏజ్‌ గ్రూప్‌ వారికైనా అప్పీలింగ్‌లా వుండాలనేది నా అభిప్రాయం. ఆయా సమయాల్లో ఉద్యమాలు, కాల పరిస్థితులు కూడా కలర్స్‌ను డిమాండ్‌ చేస్తాయి. అదేవిధంగా అక్షరాలు, బొమ్మ చుట్టూ రిలీఫ్‌ బాగా వుండేట్లు చూసుకుంటాను.

- అక్బర్‌

అంతరాల ముఖచిత్రం – 2008 మాన్‌ బుకర్‌ ప్రైజ్‌ నవల ‘వైట్‌ టైగర్‌’
ఇంకో పది పదిహేను సంవత్సరాల్లో అమెరికా ప్రపంచాధిపత్యానికి తెరపడుతుందని, అమెరికానంతర ప్రపంచానికి నాయకత్వం వహించగలిగే అవకాశం వున్న దేశాలు ఇండియా, చైనాలేనని ఈరోజుల్లో తరచు వినిపించే వాదం. పదేళ్ల క్రితం ఇండియాకి ఇవాల్టి ఇండియాకి పోలికే లేదు. రోడ్ల నిండా హోండా, టయోటా కార్లు, షాపింగ్‌ మాల్‌లు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు, కొత్త కొత్త వ్యాపార అవకాశాలు, లక్షల్లో జీతాలూ, రెండంకెలకి దగ్గరలో దేశ వృద్ధి రేటు, ఇలాంటి విషయాలు విన్నప్పుడు, ఓహో, ఇంత తక్కువకాలంలో ఎంత ‘అభివృద్ధి’ అని భ్రమ కలుగుతుంది.

ఆ వెలుగులో కళ్లు బైర్లు కమ్ముకోకుండా నిలబడి, దాని వెనక వున్న అసౌకర్యమైన చీకటిని గుర్తించడానికీ, ఆ చీకట్లో వుండే మనుషుల జీవితాలపట్ల సానుభూతితో కథలు రాయడానికి చాలా నిజాయితి, ధైర్యం వుండాలి. అవన్నీ వున్న రచన అరవింద్‌ అడిగ నవల వైట్‌ టైగర్‌. ఇది అరవింద్‌ మొదటి నవల. అద్భుతమైన శైలి, ఆసక్తికరంగా సాగే కథనం, గొప్ప వస్తువు వున్న ఈ నవలకి 2008 మాన్‌ బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. కథ విషయానికి వస్తే, గయ దగ్గర లక్ష్మణ్‌ గార్హ్‌ అనే కుగ్రామంలో రిక్షాకార్మికుడి కొడుకు బలరాం ఇందులో ప్రధాన పాత్ర. తల్లి అతని చిన్నతనంలోనే మరణిస్తుంది.

ఇంట్లో ముసలావిడ బలరాంని బడి మానిపించమని ఒత్తిడి తెచ్చినా, తాను బతికున్నంతవరకూ బలరాం చదువుకునేలా చూస్తాడు తండ్రి, అతని ఒకేఒక కోరిక బలరాం అయినా చదువుకుని బాగా బతకాలన్నదే. చాలా పిరికివాడైనా, బడిలో మిగతా పిల్లలకన్నా తెలివైనవాడు బలరాం. అయినా తండ్రి చనిపోయిన తరువాత కుటుంబ ప్రతికూలతవల్ల అన్నలాగే టీ కొట్లో పనికి చేరి, తరవాత డ్రైవింగ్‌ నేర్చుకుని వాళ్ల గ్రామంలోనుంచి నక్సలైట్ల భయంతో టౌనుకు తరలివెళ్లిన భూస్వామి కొడుకుల దగ్గర డ్రైవరుగా-నౌకరుగా కుదురుతాడు.

గ్రామాలు వదిలివెళ్లిన భూస్వాములు టౌన్‌లో ఈ అభివృద్ధి ఫలితాలు అనుభవిస్తూ బొగ్గు వ్యాపారంలో కోట్లు సంపాదిస్తూ వుంటారు. ఆ వ్యాపారాల్లో వచ్చిన అక్రమ ఆర్జనలని కాపాడుకోవడానికి వాళ్లకి స్థానికంగా కిందతరగతులనుంచి ఎదిగిన లుంపెన్‌ ‘సోషలిస్టు’ నాయకుల సహాయం వుంటుంది. ఆ భూస్వామి రెండో కొడుకు అశోక్‌ అమెరికాలో చదువుకుని, అక్కడే తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా ‘పింకీ మేడమ్‌’ అనే క్రిస్టియన్ని పెళ్లి చేసుకుని ఇండియాకి వస్తాడు. ఆయనకోసం కొన్న కొత్త హోండా సిటీ కారుకి రామ్‌ప్రసాద్‌ అనే పాత డ్రైవరు వుంటాడు. బలరాం అక్కడ రెండో డ్రైవరుగా చేరుతాడు. రాజకీయ అవసరాలకోసం అశోక్‌ ఢిల్లీ వెళ్లేటప్పుడు, బలరాం రామ్‌ ప్రసాద్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేసి అతని బదులు ఢిల్లీకి చేరుతాడు.

అక్కడ ఒకరోజు పింకీ మేడమ్‌ తప్పతాగి రోడ్డుమీద వున్న ఒక పేదపిల్లమీద కారు ఎక్కించేస్తే, ఆ నేరం తాను చేసినట్టుగా ఒప్పుకొని జైలుకు వెళ్లవలసిన ఒత్తిడులకి తలొగ్గుతాడు బలరాం. అయితే ఆ అవసరం రాదు. చాలా సాధువని, మంచివాడని భావించిన అశోక్‌ నిజరూపం కొంత అర్థమవుతుంది. మహానగరాల్లో డబ్బుతో కొనగలిగిన సుఖాలు తెలుస్తాయి. యజమానులకోసం ఎదురుచూసే డ్రైవర్లు కాలం గడపడంకోసం చదివే హత్యల వారపత్రికలు, ఢిల్లీలో పాత పుస్తకాల రోడ్డుమీద రూమీ, ఇక్బాల్‌, మిర్జాగాలీబు కవితలు పరిచయం అవుతాయి. నువ్వు ఏళ్ల తరబడి తాళం చేతులకోసం వెతుకుతున్నావు కానీ తలుపు ఎప్పుడూ తెరిచే వుంది అన్న ఉర్దూ కవి కవితతో జ్ఞానోదయం అవుతుంది.

ఒకరోజు రాజకీయనాయకుడికి లంచం యివ్వడానికి డబ్బు తీసుకెళ్తున్న అశోక్‌ని చంపి, ఆ ఏడు లక్షల డబ్బుతో బెంగుళూరు పరారీ అయ్యి అక్కడ కాల్‌ సెంటర్లలో పనిచేసే వాళ్లని రవాణా కాంట్రాక్ట్‌లు సంపాదించి, విజయవంతమైన వ్యాపారవేత్తగా మారతాడు. ఈ కథంతా బలరాం బెంగుళూరు వస్తున్న చైనా అధ్యక్షుడు వెన్‌ జియా బావ్‌ కి రాసిన వుత్తరం ద్వారా తెలుస్తుంది. ఉన్నవాళ్లకి లేనివాళ్లకి మధ్య పెరుగుతున్న అంతరాలు, ఆ అంతరాల వల్ల అనివార్యంగా పెరుగుతుండే నేర ప్రవృత్తి, హింస, చీకట్లలోంచి వెలుగులోకి రావాలని ప్రయత్నిస్తున్న చీకటి మనుషుల న్యాయమైన, సహజమైన ఆకాంక్ష. దానికి సరైన మార్గాలు కనబడక-సరైన ‘రోల్‌ మోడల్స్‌ కనబడక’- ఆరాటం. బానిసత్వం తప్ప ఇంకేమీ నేర్పని మతం, కుటుంబం.

మనముందే ఉన్నా మనకి కనబడని ఈ బీభత్సాన్ని అసాధారణ ప్రతిభతో- చిత్త ప్రసాద్‌ ఇండియన్‌ ఇంక్‌ డ్రాయింగు లాంటి చిత్రాన్ని-’అభివృద్ధి పథం’లో ఇండియా పటాన్ని ఆవిష్కరిస్తాడు అరవింద్‌. నవలలో ఒకచోట బలరాం అంటాడు, ‘డ్రైవర్‌లు హత్యల వారపత్రికలు చదివితే యజమానులు భయపడవలసిన అవసరం లేదు. కానీ మీ డ్రైవర్‌ గాంధీ, గురించో, బుద్ధుడి గురించో చదవడం మొదలు పెడితే మీరు మీ ప్యాంటులో ఉచ్చపోసుకోవాల్సిన సమయం వచ్చినట్టు’ అని. ఎంత నిజం. హత్యలూ, నేరాలూ చేసినవాళ్ళే సాధారణంగా క్షణికావేశానికి లోనైనవాళ్ళు. వాళ్ళకి కుటుంబం, సంఘం బంధనాలు ఉంటాయి. గాంధీ, బుద్ధుడూ ఆ సంకెళ్ళు విడగొట్టుకుని అనుకున్న దారిలో స్థిరనిశ్చయంతో వెళ్ళిన మనుషులు.

ఒక మనిషి వాళ్ళ జీవితాలు తెలుసుకుని ఆ ధైర్యం నేర్చుకుని, చుట్టు పక్కల సమాజంలో అలాంటి ఉన్నతమైన ఆదర్శానికి ప్రతీకలు కనబడకపోతే ఎంత విధ్వంసం సృష్టించగలిగే మృగంగా అవగలడూ? మన ‘అభివృద్ధి పథం’ అలాంటి మృగాలనీ, ఆ హింసని ఎంత నియంత్రించగలదూ? భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేవాళ్ళందరూ తప్పకుం డా ఈ పుస్తకాన్ని చదవాలి. మరుసటిరోజు మీరు ఆఫీసుకి జ్వరమని సెలవు పెట్టాల్సి వచ్చినా బెంగపడకండి. మనం ఒకరోజు పనెగ్గొడితే ఆగేదికాదు ఈ అభివృద్ధి రథం. ఈ పుస్తకం చదివి బలరాంలు నోరు తెరిచినప్పుడు వాళ్ళని ఒక నిమిషమైనా మాట్లాడనివ్వాలనే స్ప­ృహ మనకు కలిగితే, అదే ఎప్పుడైనా మన ప్రాణం కాపాడవచ్చు.

By - రమణ

జాక్సన్‌విల్‌, ఫ్లోరిడా

From: Andhrajyothy

కథా సేద్యగాడు
By: గొరుసు

కడప జిల్లాకు ఈశాన్యదిశలోని ఓ మారుమూల (బాలరాజు) పల్లెలో వృత్తిరీత్యా బడిపంతులుగా జీవిక సాగిస్తూ కథాసేద్యాన్ని ప్రవృత్తిగా స్వీకరించిన రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. మూడు జిల్లాల పొలిమేరలు కలిసే ఆటవిక ప్రాంతంలో ఉంటూ, సమీపంలో పేరున్న ఏ నగరమూ లేకపోయినా కూడా తన కథలకు రాజకీయంగా, సామాజికంగా, దేశ సమకాలీన సమస్యల్ని ఇతివృత్తాలుగా ఎన్నుకోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది.

పుష్కర కాలంగా ఆయన రాస్తున్న కథలను పరిశీలిస్తే సంక్షోభంలో పడిన సేద్యాన్ని, పల్లెల్లో మారుతున్న సామాజిక పరిస్థితులను ఒక క్రమపద్ధతిలో మనం వీక్షించవచ్చు. ముందుమాటలో కేతు విశ్వనాథరెడ్డి అన్నట్టు సన్నపురెడ్డికి అక్కడి నేల రంగు, రుచి బాగా తెలుసు. తన ప్రాంతపు కొండలూ కోనలూ, మెరకలూ బరకలూ, వాగులూ వంకలూ, గడ్డీ గాదం, పైర్లూ పచ్చలూ, కక్షలూ కార్పణ్యాలు, మంచీ చెడూ, తిండీ తిప్పలూ, కులాలూ గిలాలూ, బంధాలు అనుబంధాలూ, ఆటలూ పాటలూ, కులాసాలూ గిలాసాలూ చివరకు భాషా యాసా అన్నిటినీ తన కథా రూపాలకు అనుకూలంగా మలచుకున్న నేర్పరి. తనకు తెలిసిన జీవితాన్ని నిర్భయంగా అక్షరబద్ధం చేయగలడు. ఆయన ప్రతి కథా గ్రామీణ జీవన నేపథ్యాన్నించి వచ్చిందే. ఏ పాత్రా నేలవిడిచి సాము చేయదు. అదీకాక బంగారానికి తావి అబ్బినట్టు ఆయనది పదునైన శైలి. అందమైన వాక్య నిర్మాణం. రసాత్మక దృష్టి.

సేద్యంతో చితికిపోయిన తమ్ముళ్లతో, పిల్లల రాక కోసం పరితపించే లక్ష్మమ్మలతో, ప్రేమకోసం సర్వం ధారపోసే రంగమ్మలతో, దుర్గల్లాంటి వీరనారులతో … ఇలా ప్రతీ పాత్రతోనూ రచయితకున్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని ఈ కథలు పట్టిస్తాయి.

కథాసేద్యంతో పాటు ఒక్కోసారి జమిలిగా నవలా సేద్యాన్ని కూడా చేస్తుంటాడీయన. ఆ మధ్య పండించిన ‘చినుకుల సవ్వడి’ నవలని విమర్శకులు ఒక రసరమ్య కావ్యంగా అభివర్ణించారు. అడపాదడపా తన సాహితీ క్షేత్రంలో కవిత్వాన్ని కూడా నాటుతుంటాడు.

సన్నపురెడ్డి కథలది పెద్ద కాన్వాస్‌. అందులో ఆయన చిత్రించిన ప్రతి బొమ్మా అందమైనది, ఆత్మావలోకనం కలగజేసేది. వాటిని పరిచయం చేయటానికి, విశ్లేషించడానికి ఏవో నాలుగు పొడక్షరాలు ఇలా కెలికితే సరిపోదు. ఒక దశాబ్ది రాయలసీమ చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోగోరేవారు చదవాల్సిన కథా సంపుటి అందరికీ అందుబాటులోకి వచ్చిందని చెప్పడం కోసమే ఈ రెండు ముక్కలూ! ఇతణ్ణి ‘తెలుగు కథకున్న భవిష్యత్‌ ఆశల్లో నిస్సందేహంగా ఒకడు’గా గుర్తించిన విమర్శకుడు వల్లంపాటి మాటల్ని వమ్ము చేయని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డికి అభినందనలు.

కొత్త దుప్పటి (కథా సంపుటి)

రచన: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

పేజీలు: 252,

వెల : రూ.120,

ప్రతులకు: విశాలంధ్ర అన్ని బ్రాంచీలు

From: Andhrajyothy (19-10-08)

పనిపై కనువిప్పు మనకాలపు పిల్లలకు కొత్త సిలబస్‌
సారె తిప్పు … సాలుదున్ను

పుస్తక సమీక్ష - అల్లం నారాయణ

సాలు వెనక సాలు తీర్చిదిద్దినట్టుగా, సోలుపుగా, వంకర టింకర పోకుండా మీరెవరైనా దుక్కిదున్నగలరా! మట్టిముట్టిన ఉత్తచేతులతో గుత్తులు గుత్తులుగా వరినాటు వరసబెట్టి, మునుం తప్పకుండా నాటెయ్యగలరా! ఒరం జెక్కగలరా! తూర్పార పట్టగలరా! గాలికి వాలు చూసి చాటెయ్య గలరా! బంతికొట్టగలరా! నోటికాడికింత కొచ్చెటి మెతుకుల బువ్వముద్దను అందించగలరా! ఇదేదీ మీరు చెయ్యలేరు. వరిధాన్యమా! బియ్యమా! తెలియని అజ్ఞానంలో పెరుగుతున్న కంప్యూటర్‌ బ్రాయిలర్‌ కోడిపిల్లల తరం ఈ పనులు అసలే చెయ్యలేరు. కానీ ఒకటి మాత్రం చెయ్యగలరు. ‘సాలుదున్నిన’ క్రియాశీలి, సృజనశీలి, సంపద సృష్టికర్తను ‘ఉత్త బైతు’ … ‘ఎర్రబస్సు’ ఎక్కొచ్చినోడు అని ఈసడించుకోగలరు. అదీ సమస్య.

ఒక్క రైతునే కాదు. ఆదివాసులను, పశులమందలను ఏలే పసుల కాపర్లను, చెప్పులు కుట్టిచ్చే తోలుపని వాళ్ళను, సారె తిప్పి కుండలు కూజాలు గురుగులు మట్టి కళాఖండాలు చేసే కుమ్మరులను, సన్నపోగుపెట్టి అగ్గిపెట్టెలో ఇమిడే కళాత్మక నేత దుస్తులు నేసే సాలోళ్ళను, మురికి కంపును ఒదిలించి తాము మురికి మింగి చలువ దుస్తులందించే చాకలోళ్ళను, బొచ్చుతో ఉంటే కోతులను తలపించే మీ ముఖారవిందాలను అద్దంలో మెరిసేలా చేసే క్షురకులను, చివరకి ఇంటి పని, పాచిపని, పనిచేసే మన తల్లులను, అక్కలను, చెల్లెళ్ళను కూడా ఈసడించుకోగలరు. శ్రమను హీనంగా చూసే సంస్కృతిలో పుట్టి, అదే సంస్కృతిలో తరతరాలుగా ఒదిగి, ఎదుగుతున్న భారత సమాజంలో శ్రమకు విలువలేకపోవడం వెనక సామాన్యమైన కుట్ర ఏమీలేదు. అతి పెద్ద కుట్రే ఉంది. అది అగ్రవర్ణాల వారు మొత్తం మానవ సంబంధాలను పుట్టుకతోనే శాసించే నిచ్చెనమెట్ల వ్యవస్థను ఏర్పరచడంలో ఉంది. కొంచెం కూడా చెక్కుచెదరని కులవ్యవస్థ ‘స్థిరీకరణ’లో ఉంది. పురుష సూక్తాల్లో, వేదాల్లో, మనువు ప్రవచించిన అనాది సిద్ధాంతాల్లో ఉంది. కంచ ఐలయ్య అనే ఒక ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఆధిపత్య భావజాలాలపై పోరాటం చేస్తున్న యోధుడు. ఇప్పుడున్న దాన్ని తలకిందులుగా చూసి, అసలు సత్యాల్ని శాస్త్రీయంగా, తాత్వికంగా, సహేతుకంగా చెప్పగలుగుతున్న బుద్ధిజీవి. హిందూమతం పైన, అది శూద్రులు, పంచముల మీద రుద్దిన భావజాలంపైన ఆయన రాతలన్నీ అందుకే తలకిందులుగా ప్రశ్నించడంతో ప్రారంభమై ఒక గొప్ప తాత్విక దృష్టిని కలిగిస్తాయి. ‘నేను హిందువునెట్లయిత’ అనే ఒక సాదాసీదా మాటతో ఒక గొప్ప తాత్విక ప్రపంచాన్ని గతంలో ఆవిష్కరించిన కంచ ఐలయ్య శ్రమ గౌరవ పాఠాలకు సంబంధించి ఇప్పుడు ‘సారెతిప్పు … సాలుదున్ను’ అనే అద్భుతమైన పుస్తకం రాశారు. మానవీయ విలువల పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఏమాత్రం నమ్మకమున్న ఏ వర్ణాల వారికైనా, ఏ వర్గాల వారికైనా ఈ పుస్తకం ఇప్పటిదాకా నెత్తురులో పాతుకుపోయి ఉన్న భావాలను చెల్లాచెదురు చేసి కనువిప్పు కలిగించగల గొప్ప సాధనం.

మానవ నాగరికతకు మూలమైన శ్రమకు సంబంధించిన వివక్ష మూలాలు కుల, మత భావనల్లో ఉన్నాయన్న విషయం గురించిన కొత్త సిలబస్‌ ఈ పుస్తకం. ఈ ప్రపంచం ఎట్లా నిర్మితమయింది? దాని నిర్మాతలెవరు? పనికీ ‘జెండర్‌’కూ గల సంబంధం ఏమిటి? అది విలోమంగా ఎందుకున్నది? అసలు పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? వారికి గౌరవం ఎందుకు దక్కదు … శానిపని (నైపుణ్యం) ఏమిటి? సన్నపని ఏమిటి? ఈ శ్రమ ఎట్లా పుట్టింది? ఎన్ని మార్పులు చెందింది? ఒళ్ళు వంచి, చెమట కక్కుతూ పనిచెయ్యడం అనే ఒక గొప్ప విషయం … ఎందుకు అగౌరవంగా తయారయ్యింది. చదువు పెరిగిన కొద్దీ ఉత్పాదక శక్తుల పట్ల ఏవగింపు, చిన్నచూపు ఎందుకని వస్తున్నది? ఇది పరిణామ క్రమంలో భాగంగా వస్తున్నదా? దీనివెనక కుల, మత వ్యవస్థల ప్రమేయం ఉన్నదా? ఇలా … సహస్ర వృత్తుల సమస్త రహస్యాలు, అద్భుతాలు, ఇన్వెన్షన్లూ అన్నీ కలగలిపి నేర్పుతుంది ఈ పుస్తకం. ఇది వర్తమాన భారతంలో శ్రమకూ, శ్రమకు సంబంధించిన అన్ని వ్యాపకాలకూ ఆమడ దూరమై పోతున్న ఈ తరపు పిల్లలకు నేర్పాల్సిన విషయాలు. ఉత్తభూమి నుంచి బంగారం పండించగల నేర్పు, బట్టలు నేసే నేర్పు, సబ్బుకు మూలమైన సోడా కనిపెట్టిన నేర్పు, తోలుపనిలో వాడిన రసాయనాల నేర్పు, సారె తిప్పి కళాఖండాన్ని వేళ్ళకొనలమీద చేయగల నేర్పు, అందుకు సంబంధించిన విజ్ఞానం, దాని కారణంగా ఏర్పడిన ఇవ్వాల్టి సౌకర్యాల గురించి చాలా చిన్నచిన్న విషయాలతో, ఎక్కడా ‘జార్గన్‌’ వాడకుండా, అద్భుతంగా మలిచారు ఐలయ్య.

ఇంగ్లీషులో Turning  The Pot, Tilling The Land – Dignity of Labour in Our Times గా వచ్చిన ఈ పుస్తకానికి చంద్రిక అనువాదం చాలా సరళంగా తెలుగులోనే రాసినట్టుగా ఉంది. ఐలయ్య ఈ పుస్తకం ఎందుకు రాశారు? ఐఐటీల్లో, ఐఐఎంలలో, కేంద్ర వైద్య సంస్థల్లో చదువుతున్న అగ్రకులాల పిల్లలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎన్నో ర్యాలీలు చేశారు. వీపీసింగ్‌ బీసీల కోసం మండల్‌ కమిషన్‌ సిఫారసులు అమలుపరచాలనుకున్నప్పుడు కూడా విద్యార్థులు పెద్ద గొడవ చేశారు. ఈ ఆందోళనలో వాళ్ళు రోడ్లు ఊడ్చారు. బూట్లు పాలిష్‌ చేశారు. కూరగాయలు అమ్మారు. అంటే అర్థం ఏమిటి? డాక్టర్లై ఉండీ, మేం రోడ్లు ఊడుస్తున్నామని, ఇంజనీర్లమై ఉండీ బూట్లు పాలిష్‌ చేశామని … అంతేనా? కాదు. రోడ్లు ఊడ్వడం, బూట్లు పాలిష్‌ చెయ్యడం, కూరగాయలు అమ్మడం చిన్న పని. అగౌరవమైన పని అని. కానీ వాళ్ళు ఆ పనులు నిజంగానే చెయ్యగలరా? సహజ శస్త్ర చికిత్సలు చేసే మంత్రసానులు, మంగలి పనివారు లేకుండానే మానవ నాగరికతలో శస్త్ర చికిత్సలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? లేదు. అందుకే ఐలయ్యను ఈ విద్యార్థుల కార్యాచరణ చికాకు పరిచింది. ఆ మాటకొస్తే ఆ విద్యార్థులట్లా బయటపడ్డారు కాని మన ఇంట్లో, ప్రతివాళ్ళ ఇంట్లో వాళ్ళు శూద్రులైనా, అగ్రవర్ణాల వారైనా శ్రమ పట్ల కొద్దిపాటి గౌరవం కూడా లేకపోవడం మనకు నిత్యానుభవమే. అందువల్లే మన కాలపు ఈ మిడిమిడి జ్ఞానపు, మిడిమేళపు తరానికి మన కాలపు శ్రమ గౌరవ పాఠాలను కంచ ఐలయ్య అందించారు. ఆదివాసుల తెలివితేటలు ఏ పండు తినాలో, ఏది కూడదో మనకు నేర్పింది. అట్లాగే చాకలి వారి పని, మంగలి వారి పని, వ్యవసాయం. అన్ని వృత్తులూ విజ్ఞానానికి సంబంధించిన కొనసాగింపుగానే చూడాలనే విషయం ఈ పుస్తకంలో అనేక ఉదాహరణలతో ఉంది. ఒక్క పిల్లలకే కాదు శ్రమను మరచిపోయి, మూలాలు మరచిపోయి త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న పెద్దలకు కూడా ఇది కనువిప్పు కాగల పుస్తకం. సింగరేణిలో సమ్మె జరిగినప్పుడు గోడల మీద ఒక నినాదం ఉండేది. అది శాశ్వతమైన సత్యం. ‘కంప్యూటర్లు బొగ్గు తవ్వగలవా’ … తవ్వలేవు. బొగ్గు లేకుండా ప్రపంచం బతకగలదా? లేదు. అందువల్ల శ్రమకు సంబంధించి మౌలికాంశం భౌతిక శ్రమ, దానికి సంబంధించిన మేధోశ్రమ. దీనికి మినహాయింపు లేదన్న సత్యాన్ని కంచ ఐలయ్య పుస్తకం ఆవిష్కరించింది. భారతదేశంలో శ్రమగౌరవం లేకపోవడానికి, అశాస్త్రీయ, అభివృద్ధి నిరోధక భావజాలం ఉండడానికి కారణమైన మత, కుల వ్యవస్థల పాత్రపై, శ్రమలో ‘జెండర్‌’ వివక్షపై కూడా ఈ పుస్తకం కొంత సైద్ధాంతికంగా వివరించింది. ఇది అన్ని పాఠశాలల్లో … అన్ని గ్రంథాలయాల్లో ఉండాల్సిన పుస్తకం. ముఖ్యంగా శ్రమను గౌరవించే వారికి ఇది ‘హ్యాండ్‌బుక్‌’ కాగలిగిన విలువైన పుస్తకం. దీనికి బొమ్మలు వేసిన దుర్గాబాయ్‌ వ్యామ్‌ను ప్రత్యేకంగా పేర్కొనాలి. పెద్దగా చదువులేని దుర్గాబాయ్‌ వ్యామ్‌ ఫోనులో పాఠ్యాంశాలను విని కేవలం పది రోజుల్లో వేసిన బొమ్మలు ఈ పుస్తకానికి అదనపు అందాన్ని, అదనపు విలువనూ తెచ్చాయి. ఐలయ్యకు అనేక అభినందనలు. ఈ పుస్తకం ముద్రించిన హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌కు కృతజ్ఞతలు.

సారె తిప్పు … సాలుదున్ను, మనకాలపు శ్రమ గౌరవ పాఠాలు

రచన: కంచ ఐలయ్య

బొమ్మలు: దుర్గాబాయ్‌వ్యామ్‌

తెలుగు: చంద్రిక

ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, హైదరాబాద్‌ – 500 067.

పేజీలు: 108, వెల: రూ. 80.

Courtesy: Andhrajyothy

ఇది నా హృదయం
చూడగలిగితే ప్రతి మనిషీ ఓ విజేతే. చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే. పుట్టింది ఎక్కడైనా… అనుభవాల బాట సాగి, బాధల అగాథాల్లో దుమికి, ఆనంద జలపాతమై ఎగసి, కష్టాల మురికిని కలుపుకుని, ఇష్టాల నురగకు మురుసుకుని సాగే బతుకు ప్రవాహం స్థూలంగా అందరిదీ ఒకటే. సూక్ష్మంగా దేనికదే ప్రత్యేకం.అందరూ మానవులే అయినా ఒక్కొక్కరి రూపు వేరు, తీరు వేరు, ఆశలు వేరు, ఆశయాలు వేరు.జీవితాన్ని చూసే కోణం వేరు. సమస్యలకు స్పందించే గుణం వేరు.మనిషి జీవితం కంటే ఆసక్తికర అంశం ఈ అవనిపై మరొకటి లేదు.అందుకే ఆత్మకథలకు అంత పేరు. ‘పేరు’కు తగ్గట్టే ఆదరణా.తమకు మాత్రమే తెలిసిన తమ జీవితాన్ని, తాము చెప్పకపోతే మట్టిలో కలిసిపోయే వాస్తవాల్ని, ఏ ముసుగులూ లేకుండా ఆవిష్కరించిన జీవితచరిత్రలు ప్రపంచాన్ని కదిలించాయి, కరదీపికలై నడిపించాయి.అంత ప్రభావం ఉన్నా లేకున్నా ఇప్పుడూ ఆత్మకథలు విడుదలవుతూనే ఉన్నాయి. వెున్న వైజయంతిమాల, నిన్న దేవానంద్‌, నేడు ఎవరు… అన్నట్టుగా వచ్చిపడుతూనే ఉన్నాయి.

జీవితంలో చివరి అధ్యాయానికి ముందు…

సంపూర్ణ మూర్తిమత్వం పొందిన తర్వాత…

లౌకిక అలౌకిక స్థితికి మధ్యలో…

సాధారణంగా ఆత్మకథకు శ్రీకారం చుడతారు.

వృద్ధాప్యం నిబంధన కాదుగానీ ఓ వయసుకు వచ్చాకే ఆ ఆలోచన రావడం సహజం. అప్పుడే తమను తాము వెల్లడించుకోవాలనిపిస్తుంది. ఇన్నేళ్లుగా చెప్పలేకా చెప్పాలనిపించకా మనసు అరల్లో దాచుకున్న సంగతులన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది. అదే ఆత్మకథగా రూపుదాలుస్తుంది. ఈమధ్య శివాజీ గణేశన్‌ ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ యాన్‌ యాక్టర్‌’ విడుదలైంది. వైజయంతిమాల ‘ఎ మెవెుయిర్‌’ వెలువరించారు. భమిడిపాటి రామగోపాలం ‘ఆరామగోపాలం’ వచ్చింది. పోయినేడు ఈ జాబితాలో డి.వి.నరసరాజు(అదృష్టవంతుని ఆత్మకథ), మృణాళినీ సారాభాయ్‌(ద వాయిస్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌) లాంటివాళ్లు ఉన్నారు. అంతకుముందు గుమ్మడి ‘తీపి గురుతులు చేదు జ్ఞాపకాలు’ పేరిట తన జీవితాన్ని అక్షరబద్ధం చేసుకున్నారు. ఇంకా వెనక్కి వెళ్తే కిరణ్‌బేడి(ఐ డేర్‌), కుష్వంత్‌సింగ్‌(ట్రూత్‌, లవ్‌ అండ్‌ లిటిల్‌ మ్యాలిస్‌), కపిల్‌దేవ్‌(స్ట్రెయిట్‌ ఫ్రమ్‌ ద హార్ట్‌), బిల్‌క్లింటన్‌(మై లైఫ్‌), పండిట్‌ రవిశంకర్‌(రాగమాల), యామినీ కృష్ణమూర్తి(ఎ ప్యాషన్‌ ఫర్‌ డాన్స్‌), మన్నా డే(….మెవెురీస్‌ కమ్‌ అలైవ్‌: యాన్‌ ఆటిోబయోగ్రఫీ), సునీల్‌ గవాస్కర్‌(సన్నీ డేస్‌)… ఈ జాబితాకు కామా మాత్రమే పెట్టగలం. ‘భవిష్యత్తు గురించిన కుతూహలాన్ని పూర్తిగా కోల్పోయినప్పుడే, ఆత్మకథ రాసే వయసుకు చేరినట్టు లెక్క’ అంటారు బ్రిటన్‌ రచయిత ఎవెలీన్‌ వా. ఆ సంగతేవోగానీ, తమ ఆత్మకథను పాఠకులు ఎలా ఆదరిస్తున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ఆ రచయితల్లో మిగిలే ఉంటుంది.

ఉన్నది ఉన్నట్టు…

‘రొమాన్సింగ్‌ విత్‌ లైఫ్‌’… ఎనభై నాలుగేళ్ల దేవానంద్‌ తన ఆత్మకథకు తగిన పేరే ఎంచుకున్నారు. హిందీ సినిమాలకు సంబంధించినంతవరకూ రొమాంటిక్‌ హీరోగా దేవ్‌ ఓ చరిత్ర. ఆ ఇమేజీకి తగ్గకుండానే బాంబులు పేల్చారు. శృంగారనాయకి జీనత్‌ అమన్‌ి మీద మనసు పారేసుకున్న వైనాన్నీ నటగాయని సురయ్యా తనకు దక్కకపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్నీ దాచుకోకుండా పుస్తకంలో పరిచేశారు. మరి కొందరు స్త్రీల దృష్టాంతాలనీ ఆయన బయట పెట్టుకున్నారు. అవి రాయాలని నియమం ఏమీ లేదు. కానీ తనకు సంబంధించి ఇంకా ఏదో చెప్పుకోవాలి… తన గుండెగదుల్లో దాగుండిపోయిన వాస్తవాలను వెల్లడించి భారం దించుకోవాలి… అన్న భావనే దీనికి కారణం అయ్యుండొచ్చు. రచయిత కుష్వంత్‌సింగ్‌ ఆత్మకథా అంతే. ‘నా ఆత్మకథ రాసేముందు సంకోచించాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొందరిని బాధించే అవకాశం ఉంటుంది. అయితే నా కూతురు రాయమని బలవంతపెట్టింది. ‘నీకు నా మీద ఎంతో గౌరవాభిమానాలుండొచ్చు. కానీ నా ఆత్మకథ చదివితే మీ నాన్న ఎంత రాస్కెలో తెలుస్తుంది’ అని కూడా చెప్పా. అయినా సరే రాయమంది. నా వెుదటి శృంగారానుభవంతో సహా అన్నీ రాశాను’ అని చెబుతారు కుష్వంత్‌. ఇందులో తప్పొప్పులు, నైతిక వర్తనతో నిమిత్తం లేదు. మనిషిని మనిషిగా అర్థంచేసుకోవడమే. అంతే! అంతకుమించిన ప్రయోజనం ఆత్మకథకు లేదా అంటే… ఉంది. మనిషి జీవితం సామాజికమైందని గుర్తించడంలో పెట్టుబడిదారీ విధానం విఫలమైతే, జీవితం వ్యక్తిగతమైందని గ్రహించడంలో మార్క్సిజం విఫలమైందంటారు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌. జీవితమంటే వ్యక్తిగతమూ సామాజికమూ కూడా. సంఘానికి మనం కనిపించే తీరు వేరే. మనకు మనంగా వేరే. మన గురించిన కొన్ని నిజానిజాలు మనకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. మనసు లోతుల్లోని భావ సంచలనాన్ని ఎవరు పసిగట్టగలరు?

గాంధీజీ చేసిందదే

ప్రపంచంలో మహాత్ముడి స్థానం ఎంత ప్రశస్తమైందో, ఆత్మకథల్లో ఆయన ‘సత్యశోధన’ అంత విశిష్టమైంది. ‘ప్రతిరోజు రాత్రిపూట నా చేతులు మా తండ్రి పాదాలు వత్తుతూ వున్నా, నా మనస్సు మాత్రం పడకగది మీద కేంద్రీకరించి యుండేది. ధర్మశాస్త్రం, వైద్యశాస్త్రం, లోకజ్ఞానం మూడింటి దృష్ట్యా స్త్రీ సంగమం నిషేధించబడిన సమయంలో నా మనస్థితి యిలా వుండేది. వదిలిపెడితే చాలు వెళదామని తొందరగా వుండేది. అనుమతి లభించగానే మాతండ్రి గారికి నమస్కరించి తిన్నగా పడకగదికి వడివడిగా వెళ్లేవాణ్ణి’… తండ్రి ఆఖరు ఘడియల్లో ఉన్నా తాను శారీరకవాంఛతో దహించుకుపోయిన వైనాన్ని కూడా బాపూ రాశారు. ఇంతటి నిజాయతీ ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ముఖ్యంగా ప్రజలతో మమేకమైన నాయకుడు తన బలహీనతలను వెల్లడించడం సాహసమే. అబద్ధం చెప్పిందీ దొంగతనం చేసిందీ సిగరెట్‌ కాల్చిందీ మాంసం భుజించిందీ… ఏదీ దాచుకోలేదు. ‘ఒకరికి శక్యమైంది అందరికీ శక్యం కాగలదనే నా విశ్వాసం’ అంటారు గాంధీజీ. ఆత్మదర్శనం కోసం, ఈశ్వర సాక్షాత్కారం కోసం, వోక్షం కోసం తన మీద తానే ప్రయోగాలు చేసుకున్నారు బాపూ. తనను తాను అగ్గితో కడుక్కున్నారు, సత్యంతో పునీతమయ్యారు. అందుకే ఆ పుస్తకం పాఠకులను కదిలించింది. ప్రపంచాన్నే ప్రభావితం చేసింది.

చలం ఆత్మకథ కూడా అంతే. ఆయన రచనలంత స్వచ్ఛంగా ఉంటుంది. దాని పేరు కూడా ‘చలం’. ‘ఆత్మ కథలంటే నాకసహ్యం. ఆత్మకథ రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషైనట్టు, తానేదో ప్రజలకి తీరని ఉపకారం చేసినట్టు, తన సంగతి చెప్పుకోకపోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు, తెలియకపోతే లోకానికేదో నష్టమైనట్టు అనుకొంటున్నా డన్నమాట రాసినవాడు….. ఐనా ఆ పని జరుగుతుందంటే, ఏదీ మన చేతుల్లో లేదన్నమాట’ అని చలం వృద్ధాప్యంలో తనను రాయమని బలవంతపెట్టినవారిని ‘విసుక్కుంటాడు’. ఎలా జరిగినా ఆయన మనసు లోతుల్ని హృద్యంగా చిత్రించాడు. ‘చలంగారి గుణాల్లో నా మీద గాఢంగా ముద్రవేసింది ఆయన నిజాయితీ. గాంధీగారి తర్వాత అంత నిజాయితీపరుణ్ణి ఈయన్నే చూశాను. ఏది ప్రవచిస్తాడో అదే ఆచరిస్తాడు. గాంధీగారికి ఈయనకూ ఇంకా పోలికలున్నాయి. ఇద్దరూ సత్యాన్వేషకులు. వీళ్లు అనుష్ఠించిన సత్యాలు ఒకటి కాకపోయినా వాటి మూల తత్త్వంలో సామ్యం వుంది. ఇవి హృదయగత సత్యాలు’ అంటారు కవి ఇస్మాయిల్‌.

పశ్చాత్తాపంతో…

నిజాయతీగా, ఉన్నదున్నట్టు రాయాలంటే ఏవీ అడ్డు ఉండకూడదు. ఎవరినో మంచి చేసుకోవాలన్న తాపత్రయం ఉండకూడదు. కపిల్‌దేవ్‌ మాటల్లో చెప్పాలంటే క్రికెట్‌బోర్డు గురించి విమర్శలు చేయడానికి వెనకాడకూడదంటే, జట్టులో చోటు దక్కదేవో అన్న భయం ఉండకూడదు. ‘నాకు దాయడానికి ఏమీ లేదు. నాకు బాధలేవీ లేవు. నా జీవితం, కుటుంబం, నా స్నేహితులు, జట్టుసభ్యులు, క్రికెట్‌ బోర్డు, మీడియా అన్నింటిగురించి అందరిగురించి చెప్పగలిగిందంతా చెప్పేశాను’ అన్నారు కపిల్‌ 2004లో తన ఆత్మకథను విడుదల చేస్తూ.

అయితే, తప్పనిసరై ఉద్యోగంలో కొనసాగి, ఆ తర్వాత నిజం గుండెల్ని పిండేసి, నిద్ర కరవై, తమను తాము పునీతం చేసుకోవడానికో హృదయభారం తగ్గించుకోవడానికో రాసే ఆత్మకథలూ ఉంటాయి. జాన్‌ పెర్కిన్స్‌ ‘ఓ దళారీ పశ్చాత్తాపం’ (కన్ఫెషన్స్‌ ఆఫ్‌ యాన్‌ ఎకనామిక్‌ హిట్‌మ్యాన్‌) దీనికో ఉదాహరణ. అమెరికా దుష్కృత్యాలకు ఈయన ప్రత్యక్ష కర్త. సీఐఏ తోడేళ్లు(రచయిత వర్ణించిన పదమే) పేద, అభివృద్ధి చెందిన దేశాలను ఎలా పీక్కుతినేవారో, తమకు గిట్టనివాళ్లు ఓ దేశ అత్యున్నతస్థానంలో ఉంటే వాళ్లను పీఠం మీదినుంచి దించేయడానికి ఎలాంటి కుట్రలు పన్నేవారో నిర్భయంగా బయటపెట్టిన ఈ పుస్తకం వామపక్ష మేధావులకు బాగా దగ్గరైంది. ఎన్నో భాషల్లోకీ అనువాదమైంది.

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా కూడా ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ స్వదేశీ రిఫార్మర్‌’ పేరిట ఆర్థికమంత్రిగా తన జీవితాన్ని అక్షరీకరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళా ముఖ్యమంత్రి గురించి ఓ కార్పొరేట్‌ కంపెనీ పన్నుల తగ్గింపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ ‘కన్ఫెషన్స్‌’ పేరుమీద ఆత్మకథలు చాలానే ఉన్నాయి. అందులో సుప్రసిద్ధమైంది రూసో పుస్తకం. తన ‘పాపాలను’ అందులో బహిర్గతం చేసుకున్నారాయన. ఇదే పేరుతో అల్జీరియాలో జన్మించిన సెయింట్‌ అగస్టీన్‌ ఆత్మకథ కూడా జగద్విఖ్యాతం. క్రీ.శ.397-398 మధ్యకాలంలో రాసిన ఈ పుస్తకం తొలి ఆత్మకథగా వెలుగొందుతోంది. బిషప్‌గా మారడానికి ముందు అగస్టీన్‌ ‘పాపపంకిల జీవితం’ ఇందులో వస్తువు.

నిజాయతీ చాలా?

‘మనం జీర్ణించుకోలేని వాస్తవం ఏదో ఒకటి ఉంటేనే ఆ ఆత్మకథ నిజమని మనం నవ్మెుచ్చు. అంతా బానే ఉన్నట్టుగా ఎవరైనా తమ జీవితాన్ని గురించి వర్ణిస్తే వారు అబద్ధం ఆడుతున్నట్టే లెక్క. జీవితాన్ని తరచి చూస్తే వరుస వైఫల్యాలే కనిపిస్తాయి’ అని తేల్చేస్తారు ‘యానిమల్‌ ఫార్మ్‌’ రచయిత జార్జ్‌ ఆర్వెల్‌. జీవితంలోని చేదుకే ఎక్కువ తూకం వేసిన రచయితగా ఆర్వెల్‌ నిజాయతీకే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, ఫలానా వ్యక్తి ఉన్నదున్నట్టు రాశాడని మనం అనుకోవడమే తప్ప, అందులో వాస్తవమెంతో ఆ వ్యక్తికీ లేదూ ఆ సంఘటనలతో సంబంధమున్న వాళ్లకీ మాత్రమే తెలిసే అవకాశముంది. కానీ ఇదొక్కటే చాలా? కేవలం సంకోచాలు లేకుండా రాస్తేనే సరిపోతుందా? కానే కాదు, విషయంలో వాస్తవం ఉండడంతోపాటు, అది పాఠకుడికి కొత్త దృష్టిని ఇవ్వగలగాలి. అంతకుముందు కన్పించని కొత్త కోణాన్ని చూపగలగాలి… బాల్యంలోని మాధుర్యాన్ని టెట్సుకో కురొయనాగి రుచి చూపించినట్టు.

తొలిసారి అమ్మతో రైలెక్కింది టొటొచాన్‌(రచయిత్రే). రైలు టిక్కెట్టు చాలా విలువైందిగా తలపోసింది. గట్టిగా పట్టుకుంది. టికెట్‌ కలెక్టర్‌ దగ్గరి పెట్టెనిండా ఉన్న టికెట్లను చూస్తూ, ‘అవన్నీ మీవేనా?’ అనడుగుతుంది. ‘కాదు, అవన్నీ రైల్వేవాళ్లవి’ అంటాడాయన. ‘ఒహ్‌- పెద్ద పెరిగాక నేను రైలు టికెట్లమ్మే పనిచేస్తాను’ అనుకుంటుంది. అదే విషయం అమ్మతో చెబుతుంది. ‘నువు గూఢచారివవుతావని అనుకుంటున్నానే ఇన్నాళ్ళూ’ అంటుంది అమ్మ. అంతకుముందు రోజు వరకూ తనూ అలాగే అనుకున్నట్టు గుర్తొస్తుంది. ఆలోచనలో పడుతుంది. ‘కాని పెట్టెనిండా టిక్కెట్లు తన దగ్గరే ఉండడం ఎంత సరదాగా, ఎంత బాగుంటుంది!’ దాంతో మధ్యేమార్గంగా ‘ఆఁ! అట్లా చేయెుచ్చుగా. నిజంగానేవో గూఢచారి. పైకేవో టికెట్లమ్మే మనిషి’ అంటుంది టొటొ.

రెండో ప్రపంచయుద్ధానికి ముందు జపాన్‌లో ఓ కొత్త విద్యావిధానానికి రూపకల్పన చేసిన కొబయాషీ మాస్టారు బడి ‘టోవో’లో చేరడానికి ముందూ తర్వాతా తన చిన్ననాటి జీవితాన్ని ఆవిష్కరించారు కురొయనాగి. ఇలాంటి చిన్నారి మన బిడ్డే అయితే ఎంత బాగుంటుందన్నంత దగ్గరైపోతుంది టొటొ. బాల్యాన్ని ఇంత నిశితంగా, చిన్న చిన్న ఘటనలను కూడా విడిచిపెట్టకుండా వర్ణించిన ఈ పాక్షిక ఆత్మకథ పిల్లల మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఎన్నో భాషల్లోకి అనువాదమైన ఈ పుస్తకం తెలుగులో ‘రైలుబడి’గా వచ్చింది.

పాక్షిక ఆత్మకథ అంటే, రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘లోకసంచారి’ గురించి చెప్పుకోవాలి. తనకు ఇల్లొదిలి పారిపోవాలని ఏ వయసులో అనిపించిందో వెుదలుపెట్టి, సంచారజీవితంలోని గొప్పతనాన్ని ఆ మహాపండితుడు ఎలా వర్ణిస్తాడంటే, ఇంట్లోంచి ఎప్పుడు బయటపడదామా… అన్నంత ఉత్తేజం కలుగుతుంది.

పరమార్థం ఏమిటి?

ఓ మనిషిని చదువుతుంటే అప్పటి సామాజిక పరిస్థితులు కళ్లకు కట్టాలి. తొలిప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆత్మకథ భారత స్వాతంత్య్రోద్యమానికి అద్దం పడుతుంది. ‘మనలో చాలా మందిమి ఆ (స్వాతంత్య్ర)పోరాటం వల్ల ప్రభావితులమయ్యాం. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి ఆ పోరాటమూ అప్పుడు మనల్ని నడిపించిన ఆదర్శాలూ లక్ష్యాలే కారణం. ఇప్పుడది గత చరిత్రే కావొచ్చు. కానీ కొన్నిసార్లు వర్తమానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, చరిత్రను తెలుసుకోవడం చాలా ఉపయోగం. ఆత్మకథ అంటే వ్యక్తిగత డాక్యుమెంట్‌ కాబట్టి, వ్యక్తిగత అభిప్రాయాలూ, స్పందనలూ ఉంటాయి. అయితే ఓ గొప్ప పోరాటంలో, చెప్పుకోదగిన స్థాయిలో పాలు పంచుకున్న వ్యక్తి రాసినప్పుడు ఎంతోమంది భావాలు అందులో ప్రతిబింబిస్తాయి’ అంటారు నెహ్రూ తన ‘యాన్‌ ఆటోబయోగ్రఫీ’ ముందుమాటలో. ఓ రకంగా భారతప్రజల గుండె చప్పుడును నెహ్రూ వినిపించారు.

పుచ్చలపల్లి సుందరయ్య ఆత్మకథ ‘విప్లవపథంలో నా పయనం’ చదవడమంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అర్థం చేసుకోవడమే. ‘తెలంగాణా పోరాట నిర్వహణ అంటే చాలా అంశాలుంటాయి. ఆయుధాలు కొనాలి! మందుగుండు కావాలి! మందులు కావాలి! వాటిని జేర్చవలసిన చోటుకు జేర్చాలి! దళాలు, నిర్మాణము, వాటి కదలిక అవన్నీ క్రమబద్ధంగా వుండాలి! ఈ దళాలే వారి అవసరాలన్నింటినీ వోసుకు వెళ్ళాలి!’ అని రాశారు సుందరయ్య. ‘స్వతంత్ర భారతదేశంలో విలీనానికి నైజాం అంగీకరించడం లేదు. భారత సైన్యం జాోక్యం చేసుకుని, నిజాం రాజరికాన్ని తోసివేసి, భారతదేశంలో నైజాం సంస్థానాన్ని కలిపివెయ్యాలి అని మేము డిమాండు చేస్తున్నాము. నిజాం నిరంకుశత్వం అంతం కావాలి’ అని అప్పటి ప్రజానీకం స్పందనలను తమవిగా చేసుకున్న కమ్యూనిస్టుల ఎజెండాను ఆవిష్కరిస్తారు.

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా (లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌), స్వతంత్ర అమెరికా నిర్మాతల్లో ఒకరైన బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌(ద ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌) ఆత్మకథలు కూడా ఈ తరహావే. ఇక చార్లీచాప్లిన్‌, అకిరా కురసావా, ఇంగ్‌మార్‌ బెర్గ్‌మాన్‌ ఆత్మకథలు వాళ్ల జీవితంలోని పార్శ్వాలతోపాటు సినిమాకు సంబంధించిన లోతుల్ని పరిచయం చేస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలోని సంశయాలను పరమహంస యోగానంద(ఒక యోగి ఆత్మకథ) తీరిస్తే, మనసుపొరల్లోని సంచలనాలను హెలెన్‌ కెల్లెర్‌(ద స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌) చిత్రిక పడుతుంది.

ఉత్తుంగ తరంగమై ఎగసిన రోజా పార్క్స్‌ జీవితం అమెరికాలోని నల్లవారి దుర్భర పరిస్థితులను ఆవిష్కరిస్తుంది. అసలు దుఃఖంలోంచి అణచివేతలోంచి అద్భుత సాహిత్యం పుడుతుందనడానికి అమెరికన్‌ ఆఫ్రికన్ల జీవితాలే నిదర్శనం. బానిసత్వం మీద ఎంత గొప్ప నవలలు వచ్చాయో అంతే గొప్ప ఆత్మకథలు కూడా వెలువడ్డాయి. బుకర్‌ టి.వాషింగ్టన్‌ రాసిన ‘అప్‌ ఫ్రమ్‌ స్లేవరీ’ ఇలా ప్రారంభమవుతుంది. ‘నేను వర్జీనియాలోని ఫ్రాంక్లిన్‌ భూస్వామ్య క్షేత్రంలో బానిసగా జన్మించాను. నిజానికి, నా జననానికి సంబంధించిన కచ్చితమైన తేదీకానీ ఫలానా చోటే పుట్టినట్టుగానీ నాకేమీ తెలియదు, కానీ ఎక్కడో ఓ చోట, ఏదో ఓ సమయానికి పుట్టే ఉంటాను….’ 1901లో ప్రచురించిన ఈ పుస్తకం కోట్లాది ప్రజలను కదిలించివేసింది. అమెరికా అధ్యక్షుడితో వైట్‌హౌస్‌కు రావాలని ఆహ్వానం పొందిన తొలి నల్లజాతీయుడు వాషింగ్టన్‌. ఇంకా హారియట్‌ ఆన్‌ జాకబ్స్‌(ఇన్సిడెంట్స్‌ ఇన ద లైఫ్‌ ఆఫ్‌ ఎ స్లేవ్‌ గర్ల్‌), ఫ్రెడెరిక్‌ డగ్లస్‌(లైఫ్‌ ఆఫ్‌ ఫ్రెడెరిక్‌ డగ్లస్‌, యాన్‌ అమెరికన్‌ స్లేవ్‌), రిచర్డ్‌ రైట్‌ (బ్లాక్‌ బాయ్‌) ఆత్మకథలు కూడా సుప్రసిద్ధమైనవే.

రెండో ప్రపంచయుద్ధ సమయంలో తమ దేశాన్ని జర్మనీ దురాక్రమించినప్పుడు, కుటుంబంతో సహా రహస్యజీవితం గడిపిన నెదర్లాండ్స్‌ యూదు బాలిక అన్నే ఫ్రాంక్‌ ఆ రెండేళ్ల కాలంలో రాసిన డైరీలను ఆత్మకథా కోవలోనే విడుదల చేశారు(ద డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ గర్ల్‌). బానిసల వెతలు, నాజీల దురాగతాలు చదివితే, ‘కొన్ని అవశేషాలను కొనసాగిస్తున్నప్పటికీ మానవసమాజం ఎన్ని రకాలుగా ప్రక్షాళనకు గురైందో కదా’ అనిపించడం ఖాయం.

ఇప్పుడా శక్తి ఉందా?

ఓ స్థాయికి చేరిన ప్రతి వ్యక్తీ ఆత్మకథ రాయడానికి సంకల్పించడం సహజం. అవి ఎందరికో మార్గదర్శకం అయ్యాయన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ తనకు గాంధీజీ జీవితం సరైన పంథా నిర్ణయించుకునే దృక్పథాన్ని అందించిందని పేర్కొంటే, టాల్‌స్టాయ్‌ రచనలు తనకు స్ఫూర్తినిచ్చాయని మహాత్ముడు చెప్పుకున్నారు. అక్షరాలకు అంత శక్తి ఉంది. ‘నేను…’ అంటూ ఉత్తమపురుషలో వెుదలయ్యే ఆత్మకథల్లో పాఠకుడిని తనతో పాటు వెంట తీసుకెళ్లగలిగే ఇంద్రజాలముంది. అయితే, తప్పుదోవ పట్టించడానికో, అప్పటికి వారిమీద ఉన్న విమర్శలు రూపుమాపుకోవడానికో, సానుభూతి పొందడానికో రాసుకునే ఆత్మకథలూ ఇప్పుడు వస్తున్నాయి. ఆదరణను సొమ్ము చేసుకోవడానికో సంచలనం సృష్టించడానికో విడుదలచేసేవీ బోలెడు. ఇలాంటివి ఎక్కువగా సెలబ్రిటీలవే అయి ఉంటాయి. ఈ ధోరణి మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ. కొద్దోగొప్పో పేరున్న నటీనటులు, వోడల్స్‌ తదితరులు తమ ఆత్మకథలు విడుదల చేసుకోవడం కద్దు. ‘వారు సత్యాలు దాచారంటే వీరు అసత్యాలు రాశా’రంటూ వాదోపవాదాలు జరిగిన పుస్తకాలూ ఉన్నాయి. ఏదేమైనా, కోకొల్లలుగా విడుదలయ్యే ఆత్మకథలకు ఇదో చేర్పు మాత్రమేనా… దీనికీ ప్రత్యేక అస్తిత్వం ఉందా… అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అందుకే, ఆత్మకథలు రెండు రకాలు. చిరకీర్తిని మూటగట్టుకునేవి, అచిరకాలంలోనే కాలగర్భంలో కలిసిపోయేవి. ఇందులో ఏ రకమైనా ఆత్మకథ అక్షరమక్షరం విందుభోజనమే, పాఠకుల ఆదరణకు పాత్రమే. అవును మరి… చదివించే గుణం జీవితంలోనే ఉంది!

తెలుగు ఆత్మకథా వైభవం

తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతులు ఆత్మకథకూ బాటలు పరిచి, ‘స్వీయచరిత్రము’ వెలువరించారు. 1911లో తొలిభాగం, ఆ తర్వాత నాలుగేళ్లకు రెండో భాగం అచ్చయ్యాయి. ‘ఈ స్వీయచరిత్రము నందు వీరేశలింగ మహాశయుని జీవిత కథయేగాక యా కాలమందలి యాచారములు, కట్టుబాటులు, న్యాయస్థానములు వ్యవహారములు, దేశస్థితి వెుదలైనవెన్నో తేటతెల్లముగఁ దెలియును. అందుచేత నిది ఆంధ్రదేశము యెుక్క సాంఘిక చరిత్రమని చెప్పవచ్చును’ అంటారు ఆ పుస్తకం గురించి చిలకమర్తి లక్ష్మీనరసింహం. కందుకూరి బాటలో నడిచి, సంఘసంస్కర్తగా, గ్రంథకర్తగా ప్రసిద్ధులైన చిలకమర్తి కూడా తన ఆత్మకథను ‘స్వీయచరిత్రము’ పేరుతో రాశారు.

పోరాట నేపథ్యం ఉన్నవాళ్లు ఆత్మకథలకు ఎక్కువగా శ్రీకారం చుట్టారనిపిస్తుంది. గదర్‌ పార్టీ యోధుడు దరిశి చెంచయ్య ‘నేనూ నా దేశం’, దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’, ఆయన సోదరుడు దాశరథి రంగాచార్య ‘జీవనయానం’, కాళోజీ నారాయణరావు ‘నా గొడవ’ పేరొందిన ఆత్మకథలే. తన అంత్యక్రియలు ఎలా జరగాలో కూడా వివరంగా రాసిపెట్టిన రావి నారాయణరెడ్డి ‘నా జీవనపథంలో’ స్వాంతంత్య్రానంతరం తెలంగాణ పోరాట కొనసాగింపు విషయమై కమ్యూనిస్టుల మధ్య ఏర్పడిన విభేదాలను చక్కగా వెల్లడిస్తుంది. నల్లా నరిసింహులు ‘తెలంగాణ సాయుధపోరాటం- నా అనుభవాలు’ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఓ వీరుడి కథను తలపిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు, సేవాగ్రామ్‌లో గాంధీజీతోపాటు రెండేళ్లు గడిపిన ఎం.ఎస్‌.రాజలింగం ‘స్వీయచరిత్రము’, ‘బాపు-నేను’ పుస్తకాలు రాశారు.

ఉద్యమాలతో సంబంధం లేకుండా రచనలో ఉన్న మాధుర్యాన్ని బట్టి తిరుమల రామచంద్ర ‘హంపీ నుంచి హరప్పా దాకా’, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ‘అనుభవాలు జ్ఞాపకాలు’ గొప్ప ఆత్మకథలుగా పేరొందాయి. ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవలగా తన ‘అనంతం’ వెలువరించారు మహాకవి శ్రీశ్రీ. ‘ఆత్మకథను, స్వీయచరిత్రగా రాసుకున్న తెలుగువాళ్ల సంఖ్య పూర్వం చాలా తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ. సంస్కృత కవులు ఆత్మస్తుతీ పరనిందలకు పాల్పడలేదు గాని తెలుగు కవులు కుకవినింద మానలేదు… ఇదంతా కాలప్రభావం కావచ్చు. పూర్వ మార్గాన్ని అనుసరించటానికే ప్రయత్నిస్తాను’ అని చెప్పుకున్న బూదరాజు రాధాకృష్ణ ‘విన్నంత కన్నంత’ రాసుకున్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ‘నా జీవితయాత్ర’, రాష్ట్ర తొలి స్పీకర్‌ అయ్యదేవర కాళేశ్వరరావు ‘నా జీవిత కథ’, రాష్ట్ర తొలి రాజకీయ కార్టూనిస్ట్‌ రాంభట్ల కృష్ణమూర్తి ‘సొంత కథ’, రచయిత వేగుంట వోహన్‌ప్రసాద్‌ ‘బతికిన క్షణాలు’ పేర్లతో ఆత్మకథలు విడుదలచేశారు.

‘ఆత్మచరితము’ వెలువరించిన ఏడిదము సత్యవతి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి తెలుగు మహిళ. దీని రచనా కాలం 1934. మతం, సంఘం, దురాచారాలను నిరసించి, హేతుబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. నటి భానుమతి ‘నాలో నేను’ అంటూ తన గురించి చెప్పుకున్నారు. ఇంకా సినీ కళాకారుల్లో ధూళిపాల, పద్మనాభం, డి.వి.నరసరాజు విడుదల చేశారు. ‘…నా జీవితంలో పాఠకులకు ఆసక్తికరం కాని విషయాలు- ఘట్టాలు- చాలా వుంటాయ్‌. అవన్నీ వ్రాసి- వాళ్లను విసిగించడం ఏం న్యాయం? విసిగిస్తే- వాళ్లు తిట్టరు- కొట్టరు! పుస్తకం మూసేసి- అవతల పెడతారు!… అందువల్ల… అనవసర విషయాలు వదిలేసి చదివేవాళ్లకు- ఆసక్తికరమని నాకు అనిపించినవి మాత్రమే వ్రాయదల్చుకున్నాను’ అన్నారు నరసరాజు.

ఆత్మకథే దేశచరిత్ర

ఓ మనిషి తన గురించి తాను రాసుకుంటే… అది దేశ చరిత్ర అవడం తెలుసా? ఫిన్‌లాండ్‌ రచయిత ‘కల్లేపాటలో’కు ఆ ఘనత దక్కుతుంది. ప్రపంచంలో సుదీర్ఘ ఆత్మకథా రచయితగా పాటలో కీర్తిని ఆర్జించాడు. పదిహేడు వేల పేజీల్లో ఇరవై ఆరు సంపుటాలుగా ఆయన తన జీవితాన్ని అక్షరబద్ధం చేసుకున్నాడు. దీనికి ఆయన వెచ్చించిన కాలం… అక్షరాలా ఇరవై ఏడేళ్లు. ఆయన పుస్తకాలన్నీ ఫిన్నిష్‌ భాషలోనే రాశాడు. తొలుత చిన్న కథలు రాయడం వెుదలుపెట్టిన పాటలో తన 39వ ఏట తొలి నవల పూర్తిచేశాడు. తనకు చిరపరిచితమైన భవననిర్మాణ కూలీల జీవితాలను అందులో చిత్రించాడు. రెండో నవల్లో ఆ దేశ ఆర్థికమాంద్యాన్నీ ఆ కాలంలో ఎదుర్కొన్న కష్టాలనూ రాశాడు. మరో కొన్ని పుస్తకాల తర్వాతే పూర్తిస్థాయిలో తన ఆత్మకథా సిరీస్‌ ‘ఇజొకి’ (నది) రాయడం వెుదలుపెట్టాడు. 1971 నుంచి 98 వరకు ఏడాదికో పుస్తకం రాస్తూ పోయాడు. చివరిది పూర్తిచేసిన రెండేళ్లకు ఆయన చనిపోయాడు.

జీవితం ఓ కథగా…

పూర్తిగా ఆత్మకథ వెలువరించకుండా తమ జీవితాన్ని కథలోకి ఇమిడ్చి రాయడం ఓ పద్ధతి. లేదంటే తమనే ఓ పాత్రగా మలుచుకోవడం మరో విధానం. ఇలాంటి ‘ఆత్మకథా నవలలు’ ఎన్నో ఉన్నాయి. ‘డేవిడ్‌ కాపర్‌ఫీల్డ్‌’లో డేవిడ్‌ ఎదుర్కొన్న బాల్యం చార్లెస్‌ డికెన్స్‌దే అంటారు. ‘అన్నా కరెనినా’ కథానాయకుడు లేవిన్‌ ఆలోచనలు, మనస్తత్వం లియో టాల్‌స్టాయ్‌ను ప్రతిబింబిస్తాయని చెబుతారు. ఆయనే చైల్డ్‌హుడ్‌, బాయ్‌హుడ్‌, యూత్‌ పేరిట మూడు ఆత్మకథా నవలలు రాసుకున్నారు. ‘ప్రజల మనిషి’లోని తెలంగాణ యోధుడు కంఠీరవం పాత్ర వట్టికోట ఆళ్వారుస్వామికి దగ్గరగా ఉంటుందంటారు. ‘లోపలిమనిషి’లోని ఆనంద్‌ మాజీ ప్రధాని పీవీ నరసింహారావే అనిపించక మానడు. ‘సాధారణ గ్రామీణుడిగా ప్రారంభించి ప్రధానమంత్రిగా సాగిన దీర్ఘప్రయాణం- ఎక్కడా వేడుకంటూ లేని లక్ష్యోన్ముఖ ప్రయాణం- సాగించాడు’. ఇదీ పుస్తక సారాంశం. వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ గగుర్పొడిచే వాస్తవాలుంటాయందులో.

‘టు లైవ్స్‌’లో విక్రమ్‌ సేఠ్‌ రాసిన రెండు జీవితాలు తన అంకుల్‌, ఆంటీలవే. ‘ద గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌’లో కొంతవరకు వ్యక్తమైంది అరుంధతీరాయ్‌ తల్లి జీవితమే. ‘ఖాకీ బతుకులు’ పుస్తకంలో హీరో ప్రకాశం… రచయిత స్పార్టకస్‌ తండ్రే. ‘చదువు’లో వర్ణించిన నాయకుడు సుందరం పాత్ర కొడవటిగంటి కుటుంబరావుకు దగ్గరగా ఉంటుందని విమర్శకుల వాదన. దాన్ని కొ.కు.మాత్రం అంగీకరించలేదు. ‘…ఆత్మకథ నవలా అంటే అదీ కాదన్నారు (కొ.కు.). కానీ ఆత్మకథా నవల ఛాయలు తగుమాత్రం పొడగడతాయి’ అంటారు ‘నూరేళ్ల తెలుగు నవల’లో ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ సహవాసి. ఆయనే ‘అసమర్థుని జీవయాత్ర’ గోపీచంద్‌ మానసికస్థితికి దగ్గరగా ఉందని విశ్లేషిస్తారు. ‘హేతువాద దృక్పథానికీ చనిపోయిన తన తండ్రి పట్ల తనకు గల అభిమానానికీ అవినాభావ సంబంధం ఏర్పడి ఉండటం, ఆ రెంటి కలయిక తన వ్యక్తిత్వంపై వోపిన భారాన్ని దించుకోలేకపోవడం సీతారామారావు అసమర్థతకి మూలం. అదే అతని విషాదాంత గాథ వెనకాల దాగి వున్న మనస్తత్వ రహస్యం’ అని వెల్లడిస్తారు. ఆ నవల రాయటం ద్వారా తనలోని సీతారామారావు మరణించటం ద్వారా గోపీచంద్‌ మానసికంగా పునర్జన్మ వంటి అనుభూతిని పొంది, జీవితం పట్ల కొత్త దృక్పథం ఏర్పరచుకుంటాడంటారు. గోపీచంద్‌ తండ్రి త్రిపురనేని రామస్వామి హేతువాది అన్నది తెలిసిందే. దాన్నుంచి బయటపడి ఆధ్యాత్మిక మార్గం పట్టారు గోపీచంద్‌. ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’లో అరవిందుల తత్వం గురించి అంతగా విడమరిచి రాయడానికి గూడా అదే కారణం.

ఒక మనిషి… ఎన్నో చరిత్రలు

పిండి కొద్దీ రొట్టె… పేరు కొద్దీ జీవిత చరిత్రలు అనుకోవచ్చు. మహాత్మాగాంధీ మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. నెహ్రూ కుటుంబం మీదా అంతే. వాళ్లకున్న పేరుప్రతిష్ఠలను బట్టి ఎందరో ఎన్నో కోణాల్లో వారి జీవిత చరిత్రలు వెలువరిస్తూనే ఉన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌, అంబేద్కర్‌, భగత్‌సింగ్‌, చే గువేరా, స్టాలిన్‌, మ్యాక్స్‌ ముల్లర్‌, అబ్రహామ్‌ లింకన్‌, జేమ్స్‌ జాయిస్‌, ఆస్కార్‌ వైల్డ్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌ లాంటి ప్రముఖుల మీద కూడా ఎన్నో మంచి పుస్తకాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు మీద ‘ఒకే ఒక్కడు’, వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి మీద ‘ప్రజలమనిషి’ విడుదలయ్యాయి.

ఇవి నాయకులకే పరిమితం కాదు. సినీతారలు, క్రీడాకారుల మీదా అదే సంఖ్యలో పుస్తకాలు వస్తుంటాయి. అక్కినేని నాగేశ్వర్రావు, భానుమతి, చిరంజీవి, మహేశ్‌బాబుల మీద కూడా జీవిత చరిత్రలు వెలువడ్డాయి. మహానటి సావిత్రి మీద చాలా పుస్తకాలే వచ్చాయి. బహుశా ఆమె విషాదాంత జీవితం ఎక్కువమందిని కదిలించి ఉండొచ్చు.

నర్గీస్‌, అమితాబ్‌బచ్చన్‌, షారుక్‌ఖాన్‌, హెలెన్‌, అమీర్‌ఖాన్‌, రాహుల్‌ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌, సానియా మీర్జాల మీద కూడా పోటీపడి పుస్తకాలు రాశారు. ఇందులో కొన్ని సదరు ప్రముఖులను కలిసి, చర్చించి రాసేవైతే కొన్ని రచయితలే సొంతంగా రాసేవీ ఉంటాయి. ఎవరి జీవితచరిత్రను వాళ్లయినా చదువుకున్నారో లేదో అని ఓ జోక్‌ కూడా ఉంది. అభిమానంతో కొందరు రాస్తే, సొమ్ము చేసుకోవడానికి మరికొందరు రాస్తుంటారు. అందులోని సంచలన రాతలకు కోర్టులదాకా వెళ్లినవారు కూడా ఉన్నారు(ఉదా: క్యాథెరీన్‌ జెటా జోన్స్‌). అందుకే సదరు ప్రముఖుల సంపూర్ణాంగీకారంతో వెలువడినప్పుడు ‘అధికారిక’ జీవిత చరిత్ర అని వాడుతుంటారు. ఇంతకుముందు హేమమాలిని మీద కొన్ని పుస్తకాలు వచ్చినా ఇటీవలే ‘హేమమాలిని: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ’ విడుదలైంది.

రాసిపెడతాం

స్పూర్తిమంతమైన జీవితం గడిపినవారందరూ ఆత్మకథలు రాసుకోవాలనేం లేదు. ఫిడెల్‌ క్యాస్ట్రో ఆత్మకథను నోర్బెటో ఫ్యూంటెస్‌ రాశాడు. మాల్కం ఎక్స్‌ ఆత్మకథను ‘ఏడుతరాలు’ రచయిత అలెక్స్‌ హేలీ వెలువరించాడు. రాసేంత సమయం ఉండకపోయినా స్వయంగా రాయాలన్నంత ఆసక్తి లేకపోయినా మరో రచయితో సహచరుడో ఆ పనికి పూనుకుంటారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆత్మకథ ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’(ఒక విజేత ఆత్మకథ) ఈ కోవలోకి వస్తుంది. దీని రచయిత అరుణ్‌ తివారీ. ఇలాంటి పుస్తకాలకు ‘…తో కలిసి’ అని తమ పేరు వేసుకుంటారు. పారిశ్రామికవేత్త కిశోర్‌ బియానీ ఆత్మకథ ‘ఇట్‌ హాపెన్డ్‌ ఇన్‌ ఇండియా’కు సహ రచయిత దీపాయాన్‌ వైశ్య. ఇది పేర్లు వెల్లడించేవారి సంగతి.

కొన్ని ఆత్మకథల్లో ఘోస్ట్‌ రైటర్సే ఆ పని చేసిపెడతారు. అమెరికా సెనేటర్‌ హిల్లరీ క్లింటన్‌ తన ఆత్మకథ ‘లివింగ్‌ హిస్టరీ’ రాయడానికి ముగ్గురు రచయితల సహకారం తీసుకున్నారట. పేరు క్రెడిట్‌ మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. అలాగే హాలీవుడ్‌ తారల్లిో ఎలిజబెత్‌ టేలర్‌, స్టాలోన్‌, మడోనా, డ్రూ బారీవోర్‌ తదితరులందరూ తమ ఆత్మకథలను వెల్లడించుకున్నవారే. ఇందులో ఎందరు తామే సొంతంగా రాసుకున్నారనేది చెప్పలేం. సూపర్‌వోడల్‌ జోర్డాన్‌ అప్పుడే రెండు భాగాల ఆత్మకథ వెలువరించింది. ఈమె పేరు మీద (రాసింది వేరేవాళ్లయినా) రెండు నవలలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. జనాల్లో ఉన్న క్రేజును సొమ్ము చేసుకోవడానికి ప్రచురణసంస్థలు వేసే ఎత్తుగడలుగా కూడా వీటిని అర్థం చేసుకోవచ్చు. ‘ప్రతీ పేజీ నేనే సొంతంగా కాగితం మీద రాసుకున్నాను. కంప్యూటర్‌ కూడా వాడలేదు’ అని దేవానంద్‌ చెప్పడాన్ని బట్టి చూస్తుంటే, సొంతంగా రాయకపోవడం కూడా ఆచరణలో ఉందనే అర్థం ధ్వనిస్తోంది.

(ఈనాడు ఆదివారం అనుబంధం నుండి)

ఇంటికో ఇంద్రధనుస్సు బాపు ‘హరివిల్లు’
ఇంటీరియర్‌ డెకరేషన్‌కు అనువుగా బాపు వేసిన రంగురంగుల చిత్రాలను ఒక అందమైన కాటలాగ్‌లా తయారుచేసి, వాటికి నెంబర్లు ఇచ్చి కావలసిన వారికి వాటిని ఎన్‌లార్జిచేసి ఇచ్చేందుకు వీలుగా ‘హరివిల్లు’ పేరుతో ఒక చక్కటి పుస్తకాన్ని ప్రచురించారు విజయవాడ రైన్‌బో ఆర్ట్‌ సీరీస్‌వారు. ఈ పుస్తకం గురించి రాయబోయే ముందు బాపు చిత్రకళ గురించి కొంత సింహావలోకనం చేయవలసి ఉంది.

సాహిత్యంలో ఈ శతాబ్దం నాదని రొమ్ము విరుచుకుని మరీ చెప్పుకున్నాడు శ్రీశ్రీ. అలా ‘గత శతాబ్దంలో తెలుగునాట విచ్చుకున్న చిత్రలేఖనానికి రేఖా నిర్దేశం చేసినవాణ్ణి నేనని’ బాపు చెప్పుకోలేదు కాని కొండంత ఆత్మవిశ్వాసంతో, గర్వంగా ఆ మాటల్ని బాపుకున్న లక్షలాది మంది అభిమానులు తమ మనస్సుల్లో అనుకున్నారు. 1945వ సంవత్సరంలో బాల అనే పిల్లల మాసపత్రిక ద్వారా చిత్రలేఖనంలోకి అరంగేట్రం చేసిన బాపు ఆనాటి నుంచి ఈనాటి వరకూ వామనమూర్తిలా ఎదుగుతూ పోయాడు. ఆ ఎదుగుదల ఇంకా సాగుతూనే ఉంది.

సుమారు 30 సంవత్సరాల క్రితం రసజీవి సంజీవదేవ్‌ బాపు చిత్రకళ గురించి ఒక వ్యాసం రాస్తూ ఆయన రేఖలు ఎంత సొగసుగా ఉన్నా, ఎవరో రాసిన కథలకు బొమ్మలు వేసే ఇల్రస్టేటర్‌, కార్టూనిస్టు కావటంతో కమర్షియల్‌ ఆర్ట్‌గా తప్ప నిజమైన సీరియస్‌ కళగా పరిగణించడానికి లేదన్నారు. ఆయన చెప్పిన మాటలు ఘాటుగా ఉన్నాయనిపించినా, అందులో కొంత నిజం లేకపోలేదనిపించింది. ‘మీరు చెప్పినవి చాలామందికి వర్తిస్తాయి కాని, బాపుకు వర్తించవని’ నేను ఆయనతో విభేదించాను. దానికి కారణం ఆర్‌.కె.లక్ష్మణ్‌ లాంటి ప్రసిద్ధులు కార్టూన్‌లు వేసినా, కథలకు బొమ్మలు వేసినా, కారికేచర్‌లు వేసినా అన్నీ ఒకే రకమైన గీతలతో నిండి ఉంటాయి తప్ప వాటిలో భేదం ఉండదు. 1960 దశకంలో మన దేశంలో వివిధ భాషలలో వచ్చే ఏ పత్రికలోనూ – అది హిందీ ధర్మయుగ్‌ కావచ్చు, తమిళంలోని కుముదం కావచ్చు. కథలకు వేసే బొమ్మలు బాపు ఆనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో వేసే బొమ్మలకు కనీసం నాభి స్థాయి వరకైనా రాలేకపోయేవి. అంతేకాదు ఆనాడు అనన్య సామాన్యంగా వెలిగిన ఇల్రస్టేటెడ్‌ వీక్లీలో రావి శాస్త్రి రాసిన ‘పావలా’, ‘కార్నర్‌ సీటు’ కథలు ఇంగ్లీషులోకి అనువదించబడి ప్రచురించబడినప్పుడు వాటికి వేసిన రంగుల బొమ్మల కంటే, అవే కథలకు బాపు భావస్ఫోరకంగా వేసిన చిన్న గీతాచిత్రాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. అవి చూస్తే చాలు మనకి అర్థమవుతుంది మన బంగారం ఎంత శుద్ధమయినదో.

బాపు వేసే బొమ్మలు కొన్నిచోట్ల కథనే డామినేట్‌ చేసేటట్టు ఉండేవి. ఆ రేఖాచిత్రాలలో బాపు ఒక కొత్త ప్రక్రియను అనుసరించారు. కంటికి దగ్గరగా ఉండే వాటిని పెద్దవిగా, దూరంగా ఉండే వాటిని చిన్నవిగా గీస్తూ థర్డ్‌ డైమన్షన్‌ను (మూడవ అయితనాన్ని) రేఖల సాయంతోనే సృష్టించగలిగేవాడు. డ్రాప్ట్స్‌మాన్‌షిప్‌ కంటే ఒక కళాకారుని గొప్పతనాన్ని నిగ్గుతేల్చే గీటురాయి మరొకటి లేదు. ఇది ఒక ప్రాథమిక సూత్రం. అందులో బాపుకు నూటికి నూరు శాతం మార్కులు లభిస్తాయి. డావిన్సీ వేసిన రేఖాచిత్రాలను చూస్తే ఇది మనకర్థమవుతుంది. ఆనాడు రీడర్స్‌ డైజెస్ట్‌లో వచ్చే కథల బొమ్మల్ని ఎవరైనా చూసి ఉంటే బాపు బొమ్మలు వాటితో సమాన స్థాయిలో వున్న విషయం గుర్తిస్తారు.

బాపు తాను ఒక్కడిగా ఉంటూనే చతుర్ముఖ బ్రహ్మలా అనేక భిన్నమైన రేఖా ప్రక్రియలను సొంతం చేసుకున్నాడు. కార్టూన్లకు వేసే గీతలకు, కథలకు వేసే వాటికి, కేరికేచర్‌లో వేసేవాటికి ఎక్కడా పోలికే ఉండదు. అలానే పౌరాణిక గాథలలో కొన్నిటిని జానపద శైలిలో, కొన్ని తంజావూరు శైలిలో, మరికొన్ని పదహారవ శతాబ్దం నాటి విజయనగర కంచువిగ్రహ శైలిలో గీస్తూ తన బహుముఖ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు ప్రచురించబడిన ఈ ఆల్బమ్‌లో అలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆల్బమ్‌లో ఉన్న ఆర్ట్‌ నెం. 213 గీతోపదేశం చిత్రంలో బాపు పెడన, కాళహస్తిలలో ఉండే కలంకారీ శైలిలో చిత్రాన్ని గీసి మెప్పించటం చూడవచ్చు. అలానే భారత, రామాయణ గాథలేగాక ఆర్ట్‌ నెం. 288లో క్రీస్తు జననాన్ని చిత్రించారు. ఇందులో ప్రాచ్య, పాశ్చాత్య ధోరణులు రెంటినీ గొప్పగా మేళవించారు. శేషతల్పంపై శయనించిన నారాయణుణ్ణి రెండు భంగిమలలో ఆర్ట్‌ నెం. 076, 089లలో చిత్రించి తాను ఒకే విషయంపై ఎన్ని భిన్న ప్రక్రియలకు పోగలడో మన ముందుంచాడు.

చిత్రకళలోని ఏ ప్రక్రియనైనా బాపు చాలా సులువుగా ప్రావీణ్యం సాధించగలుగుతాడు. అందుకు తాజా తార్కాణం బాపు వేసే రంగుల బొమ్మలు. మొన్నటి వరకూ బాపు రేఖా చిత్రాలు గీస్తూ, ఆ రేఖల మధ్య రంగును నింపుకుంటూ (ఞటజీఝ్చటడ ఛిౌజూౌటట ౌnజూడ, nౌ్ట ్టౌn్ఛట) వచ్చేవాడు. ఇప్పుడు టోనల్‌ రంగుల చిత్రాలలో కూడా తన ప్రతిభను నిలబెట్టుకున్నాడు. అందుకు ఉదాహరణలుగా నిలబడతాయి ఆర్ట్‌ నెం. 368 ఉత్తరం చదువుతున్న అమ్మాయి, ఆర్ట్‌ నెం. 279 సత్యసాయిబాబా, ఆర్ట్‌ నెం. 093 బాలకృష్ణుని నోటిలో విశ్వరూపాన్ని వీక్షిస్తున్న యశోద. ఇవికాక ఆర్ట్‌ నెం. 339లో బాపు సాధించిన సున్నితమైన వర్ణవిశేషాలు మనం గమనించవచ్చు.

చారడేసి కళ్ళు, బారెడేసి జడ, దాని చివర జడగంటలతో పదహారణాల తెలుగు అమ్మాయిల సౌందర్యాన్ని తన చిత్రాలలో ద్విగుణీకృతం చేశాడు బాపు. వీపు మీద వేలాడే జడపై ఆయనకు మక్కువ ఎక్కువనుకుంటాను. అది సమయం చిక్కితే చాలు వైకుంఠపాళీలో పాముల్లా మెలికలు తిరుగుతూ వింత పోకడలు పోతుంది బాపు చిత్రాలలో. ఏ రెండు చిత్రాలలోనూ జడ ఒక్కలా ఒంపులు తిరగదు. అసలు బాపు ఏ రెండు చిత్రాలూ ఒక్కలా ఉండవు. అదే ఆయన ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన బాపును ఆర్టిస్టే కాదని (అనేవారు కొందరున్నారు) ఎవరైనా అంటే విరుచుకుపడేవాడు చలసాని ప్రసాదరావు. నిజంగా ఇప్పటికీ అలా ఎవరైనా భావిస్తే అది ఆర్టిస్టు అన్న పదాన్నే కించపరచిన వారవుతారు. వారు బాపునే కాదు అతని మార్గంలో సాగుతున్న అప్రతిమాన ప్రతిభావంతులు, బాపు అంతేవాసులైన చంద్ర, బాలి, మోహన్‌లతో పాటు అనేకమంది బాపు ఏకలవ్య శిష్యులను కూడా అర్థరహితంగా కించపరచినట్లవుతుంది. ఈ రోజు భారతదేశంలో ప్రతిభావంతమైన రేఖా చిత్రకారులు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. దీనికి బాపుయే దిశా నిర్దేశకులు. ఇది నేను ప్రాంతీయ అభిమానంతో చెబుతున్న మాటకాదు. ఇంత చక్కటి పుస్తకాన్ని తీసుకొచ్చిన గంధం దుర్గాప్రసాన్‌ (నేను డి.సి (సి.టి)గా విజయవాడలో ఉన్నప్పుడు నా వద్ద పని చేశాడు) నా వాడే కావటం నాకు మరింత ఆనందాన్నిస్తుంది. అతన్ని అభినందిస్తున్నాను.

తాజాకలం

బాపు చిత్రకళను ఎక్కడా, ఏ లలితకళాశాలలోనూ అభ్యసించలేదు. కొంతకాలం ‘గోపూ’ అనే ఆయన వద్ద రేఖాచిత్రాల మూలసూత్రాలు నేర్చుకున్నట్టుగా ఆయనే చెప్పినట్టు గుర్తు. బాపు చిత్రకళ స్వయం సిద్ధం, స్వాభావికం. ఆయన చిత్రాలకు ఆయనే గురువు, ఆయనే శిష్యుడు. బొమ్మలు వేస్తూ వేస్తూ సాధించిన ప్రావీణ్యమది. అందుకని తనలానే గురువు లేనివారికి పాఠాలుగా ‘ఏౌఠీ ఐ జ్ఛ్చూటn్ఛఛీ ్టౌ ఛీట్చఠీ’ పేరుతో బాపు స్వదస్తూరీతో ఇంగ్లీషులో రాసిన ఒక వ్యాసాన్ని ఈ పుస్తకం చివర ప్రచురించారు.

అది ఈ పుస్తకంతో పాటు మనకు లభించే బోనస్‌.

ఇది ఖచ్చితంగా ప్రతి తెలుగువారింట ఉండదగ్గ పుస్తకం. మీ బంధువులలో కాని, మిత్రులలో కాని చిత్రకళపై మక్కువ చూపిస్తున్న పిల్లలెవరైనా ఉంటే వారికి ఈ పుస్తకాన్ని బహూకరించండి. వారు ఆజన్మాంతం మిమ్మల్ని మరువరు.

హరివిల్లు: బాపు బొమ్మలు ఫర్‌ ఇంటీరియర్‌ డెకరేషన్స్‌ (క్యాటలాగ్‌), సంపాదకుడు: గంధం కనక దుర్గాప్రసాద్‌,

ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ.

పేజీలు: 140, వెల: రూ. 500/-

-కాండ్రేగుల నాగేశ్వరరావు

(4-11-2007 ఆదివారం ఆంధ్రజ్యోతి నుండి)

‘తెలంగానం’
గోదారి ముంచటం చూసినం/ గోదాట్లో ముంచడం కొత్త కథ’ తెలంగాణను అభివృద్ధికి దూరం చేస్తున్న పరిణామాలపై హనీఫ్‌ ఆవేదన ఇది (అడవీ, అంబులపొది). ఇది కాకుండా శవాల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి తెలంగాణలో విషాదం. అన్నలో, అయ్యలో, లేకపోతే దుబాయిలో మరణించిన వారో – ఒక సంక్షోభం నుంచి విముక్తం కావాలనుకున్నవారంతా శవాలై గ్రామాలకు చేరడం గురించి వి.ఆర్‌.శర్మ (ఇంకారాని శవాలు) రాసిన కవిత ఈ 55 కలాల సంకలనంలో చాలాకాలం గుర్తుంటుంది. చక్కని ముఖచిత్రం, కవితలకు వేయించిన ముచ్చటయిన చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.

తెలంగాణ కవిత (2006),

సం. సుంకరి రమేశ్‌, అన్వర్‌, ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలలో

పేజీలు 116

వెల రూ 50

(4-11-2007 ఆదివారం ఆంధ్రజ్యోతి నుండి)

సుప్రసిద్ధ పాతిక
‘బాధల ముళ్లు గుచ్చుకుని బతుకు పచ్చి గాయమై’నా సాహితీ సేద్యాన్ని కొనసాగించిన సహవాసి మిగిల్చి వెళ్లిన చివరి ఫలం ‘నూరేళ్ల తెలుగు నవల’.

కావ్యాలు, ప్రబంధాల మత్తు వదిలించి, వాస్తవికత కొరడాతో పాఠకులను నిద్రలేపిందని నవలకు పేరు. ఏ అవలక్షణాలను ఈసడించి ఈ ప్రక్రియ వెుదలైందో అందులోనూ అవి జొరబడినై. లేదంటే ఈ వందేళ్లుగా రాసినవన్నీ ఉత్తమ నవలలే కావాలి. కోకొల్లలుగా ఉత్పత్తి అవుతున్న వాటికి భిన్నంగా, ఉరిమి, చిల్చి, చెండాడి… తన తరం పాఠకులనే కాదు, రాబోయే తరాలనూ ప్రభావితం చేయగలిగే రచనలను ‘తెలుగునాడి’లో పరిచయం చేస్తూ వచ్చారు సహవాసి. నవలను తెలుగునేలకు ఆహ్వానించిన కందుకూరి ‘రాజశేఖర చరిత్ర’తో వెుదలై, మట్టివాసనతో గుబాళించే వాసిరెడ్డి సీతాదేవి ‘మట్టిమనిషి’తో ముగిసే ఈ పుస్తకంలో మాలపల్లి, వేయిపడగలు, మైదానం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, చదువు, అల్పజీవి, ప్రజలమనిషి, పెంకుటిల్లు, బలిపీఠం, మైనా, అంపశయ్య, హిమజ్వాల లాంటి పాతిక ఆణిముత్యాలనూ ఆయా రచయితల జీవితవిశేషాలనూ అందించారు. ‘వెన్న పడుతుండగా పగిలిపోయిన చల్లకుండ కళ్ల ముందు ఆడుతుంది’ అని బాధపడ్డారు దుర్భర దారిద్య్రంతో మూడు పదుల వయసులోనే కన్నుమూసిన మంచి-చెడూ రచయిత ‘శారద’ను తలుచుకుంటూ. ‘వస్తు, శిల్పాలు రచనలో చాలా సన్నిహితంగా కలిసిపోవటం ఉన్నత విలువలు కలిగిన సాహిత్య లక్షణం…’ అంటారు బాపిరాజు ‘నారాయణరావు’ పరిచయంలో. ఇది అన్ని పుస్తకాలకూ వర్తించే వ్యాఖ్య. తెలుగు నవలా సముద్రంలో ఒక్కసారీ మునకలేయని వారికి, ఏం చదవాలో సూచించే దిక్సూచి ఈ పుస్తకం. ఆ అలవాటు ఉన్నవారికి కొత్త వెలుగులు చూపించే దీపపు కాంతి.

నూరేళ్ల తెలుగు నవల(1878-1977);

రచన : సహవాసి

సంపాదకుడు : డి.వెంకట్రామయ్య;

పేజీలు : 230; వెల : రూ.100/-

ప్రతులకు : నవోదయ, కాచిగూడ, హైదరాబాద్‌-27.

- షేర్‌షా

ఈనాడు ఆదివారం అనుబంధం – అక్టోబర్ 7, 2007

రాత ఆయన శ్వాస
సహవాసి అనే జంపాల ఉమామహేశ్వరరావు ఇకలేరు. తెలుగులో అత్యుత్తమ అనువాదకుడు సహవాసి. ఆయన అనువాదమయినా, సంపాదకీయమై నా, పత్రికావ్యాసమయినా సహజంగా ప్రౌఢంగా ఒక జీవనదీ ప్రవాహంలా సాగిపోతుంది. ఆయన పేరులేకపోయి నా ఆయన శైలినిబట్టి ఇది సహవాసి రచన అని చెప్పగలిగే పాఠకులు ఆంధ్రదేశంలో అనేకమంది ఉన్నారు. తన రచనతో మమేకమయ్యే అరుదైన రచయిత సహవాసి. ఆ రచన ఉత్తమమైనా కాకున్నా, దాని లక్ష్యం శ్లాఘనీయమైనా కాకున్నా, ఉదాత్తమైనా కాకున్నా ఆయన ఎంతో శ్రద్ధగా మనసుపెట్టి రాసేవారు. ఒక రచనకు డబ్బులు వస్తాయా రావా అన్న గీటురాయి కూడా ఆయన ఎప్పుడూ పెట్టుకోలేదు. తాను చేసే రచన లక్ష్యాన్ని ఆయన ఎంత పట్టించుకొనేవారో తెలియదు. కాని ఆయన రచనను ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్ధగా చేసేవారు. ఈ సంగతి ఆయన తన రచనాకార్యక్రమం కొనసాగిస్తున్నప్పుడు గమనించినవారికి తెలుసు. అలా ప్రత్యక్షంగా గమనించకపోయినా ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారందరికీ తెలుసు. అందుకే సహవాసి తన రచనా కార్యాన్ని మోహించినంతగా రచనాలక్ష్యాన్ని ప్రేమించలేదేమో అనిపిస్తుంది. ఆయన తన రచనాక్రియతో శృంగారం నెరిపేవారనిపిస్తుంది.

ఆయనకు భాషమీద అమోఘమైన పట్టు ఉంది. అటువంటిపట్టులేని వారిలో కనిపించే మోజూ ఉండేది. అదే ఆయనని దగ్గరగా చూసేవాళ్ళకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది. ఆయనలో ఇంకా ఇటువంటివే ఎన్నో చిత్రాలు కనిపించేవి. ఆయన తన అనువాదాల్లో అత్యంత సంక్లిష్టమైన సన్నివేశాన్ని, ఎంతో సంకీర్ణమైన మానసిక ఘర్షణనీ పాఠకునికి అందించగలిగిన నేర్పు ప్రదర్శించేవారు. అయితే తనచుట్టూ జీవితంలో ఉన్న అతిచిన్న మెలికను కూడా పసికట్టేవారు కాదు. అంతటి అమాయకత్వమూ, పసిపిల్లల్లో మాత్రమే కనిపించే మనస్తత్వమూ ఈ ప్రౌఢరచయితకు ఎలా సాధ్యమా అని ఆశ్చర్యం కలిగేది. ఆయన సంపాదకీయంలో కనిపించే విశ్లేషణాశక్తిగాని, ఆ పరిణతిగాని తన పరిసరాలను పరికించేటప్పుడూ, తనచుట్టూ ప్రపంచంతో వ్యవహరించేటప్పుడూ కలికానికి కూడా కానవచ్చేవి కాదు. ఆయన స్వతహాగా వినయశీలి. తన మనుమల వయసున్న పిల్లల దగ్గర సైతం వినయంగా, ఎంతో మర్యాదగా ఉండే తత్వం ఆయనది.

అతి సాదావ్యక్తుల్ని సైతం ఎంతో గౌరవంగా, సాదరంగా పలకరించే మనిషి ఆయన. అయి తే ఆయనకి అప్పుడప్పుడు కోపం వచ్చేది. కొన్నిసార్లు అది పిచ్చికోపం. కొన్నిసార్లు సత్యాగ్రహం. ఏదైనా అది పెద్దపెట్టున ముంచుకువచ్చేది. అప్పుడు ఎదురుగా ఉన్నది సాక్షాత్తూ త్రిమూర్తులే అయినా జడుసుకొనేలా తిట్టేవారు. అయితే అటువంటి సందర్భాలు ఆయన జీవితంలో అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయి. ఆయన జర్నలిస్టుగా అనేకపత్రికల్లో పనిచేశారు. ఎక్కువకాలం ఈనాడులో చేశారు. 1983నుంచి 1996 వరకూ అక్కడే ఉన్నారు. ఆయనలో విశేషమేమంటే ఫ్రీలాన్సర్‌గా ఈనాడులో ఫీచర్స్‌ రాసినప్పుడు ఎంత శ్రద్ధగా రాశారో సంపాదకీయాలు రాసినా అంతే శ్రద్ధగా రాశారు. అంతేకాదు, ఈనాడు తరువాత ఆయన పొట్టపోసుకోవడానికి అనేక చిన్నపత్రికల్లో పనిచేశారు. రాశారు. పత్రిక చిన్నదయినా, పెద్దదయినా-జీతం ఎక్కువయినా, తక్కువయినా -తాను రాసే రాతలో అశ్రద్ధని జొరపడనివ్వలేదు.

తన యజమాని అభిరుచి ఉన్నవాడయినా, లేనివాడయినా ఆయనకి తన రచన విషయంలో ఎన్నడూ చిన్నచూపులేదు. ఆయనలో ఉన్న రచయిత విలువ తెలిసినవారు అడిగినప్పుడూ, పద్దులు రాయడానికీ సంపాదకీయం రాయడానికీ మధ్య ఉండే తేడా తెలియనివారు అడిగినప్పుడూ ఆయన ఒకే తీరున స్పందించేవారు. అదే వింతగా అనిపించేది. రాయమని అడిగినవారికి ఆయన ఎప్పుడూ రాయననలేదు. ఆయన తన రాతకి తప్ప ఎవరికీ విధేయుడు కాదనిపించేది. ఆయన తన ఎజి ఆఫీసులో అనుభవాల గురించి గానీ, తన జర్నలిస్టు జీవితంలో ఎదురయిన సాధకబాధకాల గురించిగానీ మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఆయన చదివిన ఒక పుస్తకం గురించో, అందులో ఒక పాత్ర గురించో, తను చేసిన ఒక రచన గురించో మాట్లాడుతున్నపుడు ఆయనలో కనిపించే ఉత్సాహంగానీ, ఉద్వేగంగానీ తాను రోజూ వ్యవహరించే వాస్తవప్రపంచం గురించి మాట్లాడేటప్పుడు ఏ కోశానా కనిపించేదికాదు. అనువాదకుడిగా ఆయన సంపాదించింది అతి పరిమితం. తెలుగులో ఆయన అనువాదం చేసిన ఒక పుస్తకం అత్యధిక ముద్రణలకు నోచుకుంది. దానికి ముట్టిన పారితోషికం గురించి అడిగాను.

పారితోషికం సంగతి అలాపెట్టి-తాను ఎజి ఆఫీసులో ఉద్యోగానికి కొంతకాలం సెలవుపెట్టి ఆ పుస్తకాన్ని అనువదించాననీ, ఆ కాలంలో తాను తాగిన సిగరెట్లకి సరిపడా కూడా తనకి డబ్బులు ముట్టలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. అయితే ఎప్పుడూ అటువంటి విషయాలమీద ఊరికే ఫిర్యాదు చేస్తూ కూర్చోలేదు. చిట్టచివరి రోజు వరకూ తన రాతమీద బతికిన మనిషి సహవాసి. ఆ పని ఆయన ఎంతో ఇష్టంగా సహజంగా చేశారు. శ్వాసించడం ఎంత సహజమో, రాయడం అంతసహజం అన్నట్టుగా ఆయన జీవించారు. ఆయననుంచి ఆయన రచనాకార్యక్రమాన్ని ఏ విషయమూ వేరు చేయలేదు, ఒక్క మరణం తప్ప. ఆయన పీకాక్‌ క్లాసిక్స్‌కి ‘అమ్మ’ నవలను సంక్షిప్తం చేసి పెట్టారు. ‘పంచతంత్రం’ రాసిచ్చారు. చివరిలో గుణాఢ్యుని ‘బేతాళ కథలు’ ఇచ్చారు. ఆయన స్వయంగా ప్రచురించుకొన్న రెండు గ్రంథాలు ‘తిరస్కృతులు’, ‘విముక్తి’ వీలుంటే పునర్ముద్రించమని ఇచ్చారు. ఈ మూడు పుస్తకాలూ వెలికి తీసుకురావడంలో జాప్యం జరిగింది. ఈలోగా ఆయన కన్నుమూశారు. అందుకే నాకు చెప్పరానంత దుఃఖంగా ఉంది. కన్నీటితో…

- ఎ.గాంధి

పీకాక్‌ క్లాసిక్స్‌

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 30 ఆగస్ట్ 2007 నుండి